ఆర్గానిక్ పంటల ద్వారానే ఆరోగ్యవంతమైన సమాజం
సమావేశంలో మాట్లాడుతున్న సేవా ఫౌండేషన్ సీఈవో మూల కృష్ణ
నారద వర్తమాన సమాచారం: భూదాన్ పోచంపల్లి, ప్రతినిధి:
ఆర్గానిక్ వ్యవసాయం పంటలు పండించడం ద్వారానే ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించిన వారమవుతామని సేవా స్వచ్ఛంద సంస్థ సీఈవో మూలకృష్ణ అన్నారు.
భూదాన్ పోచంపల్లి మండలంలోని జలాల్ పురం గ్రామంలోని స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో గురువారం రైతు అవగాహన సదస్సు కార్యక్రమంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరై ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ
నేటి సమాజంలో పండిస్తున్న పంటలలో విపరీతమైన రసాయనాలు వాడకం ద్వారా పూర్తిగా కలుషితం తో కూడిన ఆహారాన్ని తినడం ద్వారా అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు. మానవ జీవన ప్రమాణం కూడా తగ్గుతుందని ఆయన తెలిపారు.
భూమిలో సారవంతం చేయడానికి వాడుతున్న కెమికల్ యూరియా నివారించి జీవ రసాయన ఎరువుల వాడడం ద్వారా భూమి సారవంతం అవుతుందని, ఆర్గానిక్ వ్యవసాయం ద్వారా ప్రజా జీవనం ప్రమాణం పెరగడంతో పాటు ఆరోగ్యవంతమైన సమాజం నిర్మించడానికి దోహదపడుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ సాయిలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.