నారద వర్తమాన సమాచారం
మాజీ ఎమ్మెల్యే రేఖా నివాసంలో ఈడీ సోదాలు?
ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ నివాసంలో విజిలెన్స్ అధికారు లు సోదాలు నిర్వ హించారు. ఈరోజు తెల్లవారుజామునే ఈడీ అధికారుల బృందం రేఖా నాయక్, నివాసానికి చేరుకుని తనిఖీలు చేపట్టారు.
సీఎంఆర్ ధాన్యం డబ్బులు చెల్లింపు ల్లో మనీ లాండరిం గ్‌కు పాల్పడినట్లు మాజీ ఎమ్మెల్యేపై ఆరోపణలు ఉన్నా యి. ఈ క్రమంలోనే సీఆర్పీఎఫ్ భద్రత మధ్య సోదాలు కొనసాగుతున్నాయిరూ.40.96 కోట్ల విలువైన 6,393 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయం చేసినట్టు ఆగస్టులో కేసులు నమోదు అయిన విషయం పాఠకులకు తెలిసిందే.
రేఖా నాయక్‌కు సంబంధించిన రైస్ మిల్లుల్లో భారీగా అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ కావడంతో ఈడీ, విజిలెన్స్ అధికారు లు రంగంలోకి దిగారు. సోదాల్లో భాగంగా మాజీ ఎమ్మెల్యే ఇంట్లో బీరువాలు తెరిచేం దుకు అధికారులు ప్రయత్నించారు.
దానికి సంబంధిం చిన తాళాలు తన వద్ద లేవని చెప్పడం తో వాటిని తెరిచేందుకు వెల్డర్ ను ఈడీ బృందం పిలిపించింది. దాదాపు నాలుగు గంటలుగా కొనసాగుతున్నాయిఈ క్రమంలో రేఖా నాయక్‌ను అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జరుగుతుం డటంతో ఆమె నివా సం వద్దకు అనుచ రులు భారీగా చేరుకుంటున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








