నారద వర్తమాన సమాచారం
పదవీ విరమణ పొందిన ఏడు మంది పోలీసు అధికారులు మరియు సిబ్బందికి ఆత్మీయ వీడ్కోలు
పల్నాడు జిల్లా పరిధిలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి, కర్తవ్య నిర్వహణలో చిత్తశుద్ది, అంకిత భావంతో పోలీస్ శాఖ ద్వారా ప్రజలకు విశిష్ట సేవలందించి ది . 30.06.2024 వ తేదీన పదవీ విరమణ చేసిన ఏడు మంది పోలీస్ అధికారులను పల్నాడు జిల్లా పోలీసు కార్యాలయం నందు పల్నాడు జిల్లా సూపరింటెంట్ ఆఫ్ పోలీస్, మలిక్ గార్గ్, ఐ.పి.ఎస్.సుదీర్ఘకాలం పాటు పోలీస్ శాఖ ద్వారా ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించినందుకు గాను అభినందించి పోలీస్ మర్యాదలతో శాలువాలతో పూల దండలతో సత్కరించి ఆత్మీయ వీడ్కోలు పలికినారు.
పదవీవిరమణ పొందిన వారి వివరాలు :
(1) సి హెచ్ . వెంకట వీరాంజనేయులు సబ్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్, నం” . 959, డి సి ఆర్ బి పల్నాడు జిల్లా,
2) ఎమ్ రామ మోహన రావు, అసిస్టెంట్ సబ్ఇన్స్పెక్టర్ 996, సత్తెనపల్లి టౌన్ పి ఎస్
3) ఎమ్ .చెంచయ్య, అసిస్టెంట్ సబ్ఇన్స్పెక్టర్ 357, ఐనవోలు పి ఎస్
4) వై .భాస్కర రావు ఏ ఆర్ ఎస్ ఐ , డిఋఎ ఆర్ పల్నాడు జిల్లా.
5) ఎమ్ వేంకటేశ్వర రావు, హెడ్ కానిస్టేబుల్ 1845, చిలకలూరిపేట పట్టణ పి ఎస్
6) మొఘల్ నాయబ్ రసూల్ ఏ.ఆర్.హెడ్ కానిస్టేబుల్ , 2427 డి ఎ ఆర్ పల్నాడు జిల్లా
7) పఠాన్ నానుల్ల ఖాన్ ఏ.ఆర్.హెడ్ కానిస్టేబుల్ , 1242 డి ఎ ఆర్ , పల్నాడు జిల్లా
ఈ కార్యక్రమంలో సి హెచ్ లక్ష్మీపతి అడిషనల్ ఎస్పి క్రైమ్ , గాంధీ రెడ్డి, డి ఎస్పీ ఎ ఆర్ , .ఎస్.బి.సీఐ బి .. సురేష్ బాబు డిస్ట్రిక్ట్ పోలీసు కార్యాలయం ఏ.ఏ.ఓ. కె వి డి రామా రావు , ఆర్ ఐ వెల్ఫేర్ గోపినాథ్ పల్నాడు జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు టి . మాణిక్యాల రావు మరియు అధికారులు, సిబ్బంది పదవీ విరమణ పొందిన వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.