నారద వర్తమాన సమాచారం
విజయవాడ ను అభివృద్ధి మాత్రమే కాకుండా అందంగా సుందరంగా తీర్చిదిద్దిన ఘనత స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.యస్
విజయవాడ సిబ్బంది బుధవారం సాయంత్రం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నగర కమిషనర్, విధుల నుండి రిలీవ్ అవుతున్న సందర్భంగా, విజయవాడ లో పనిచేస్తున్న శాఖాధిపతులు మరియు సిబ్బంది కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ కీ ఘనంగా సెండ్ ఆఫ్ నిర్వహించి, శ్రీకాకుళం జిల్లాకి కలెక్టర్గా వెళ్తున్నoదుకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా అడిషనల్ కమిషనర్ (జనరల్) డాక్టర్ ఏ మహేష్ మాట్లాడుతూ కమిషనర్ స్వప్నిల్ విజయవాడలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు అయినా రాజీవ్ గాంధీ పార్క్ రేనోవేషన్, సాధారణ డంపింగ్ సైట్ను ఆర్ ఆర్ ఆర్ విజ్ఞాన కేంద్రం గా తీర్చిదిద్దారని, పైకాపురం చెరువు, అంబేద్కర్ పార్క్, కెనాల్ క్లీనింగ్, వ్యర్థ పదార్థాల నిర్వహణ, ఈట్ స్ట్రీట్, స్పోర్ట్స్ స్టేడియంస్ అభివృద్ధి, నగరంలో ఉన్న అందమైన స్ట్రీట్ లైట్లు, గ్రీనరీ, వర్టికల్ గార్డెన్స్, మగోల కోసం ప్రత్యేకంగా పింక్ టాయిలెట్, రివర్ ఫ్రెండ్ పార్క్, విజయవాడ నగరానికి తీసుకొచ్చిన స్వచ్ఛ సర్వేక్షన్ రెండు అవార్డులు, ఒక స్కాచ్ అవార్డ్, క్లైమేట్ స్మార్ట్ సిటీస్ అసెస్మెంట్ ఫ్రేమ్ వర్క్ అవార్డు, గార్బేజ్ ఫ్రీ సిటీ సర్టిఫికెట్ అవార్డు, స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు, ఎయిర్పోర్ట్ కారిడార్ డెవలప్మెంట్, ఆర్ ఆర్ ఆర్ నాలెడ్జ్ సెంటర్లో కంచు విగ్రహం ఏర్పాటు లాంటివి ఎన్నో చేశారని తెలిపారు.
వివిధ శాఖదీపతులు ఏసీపీ కె. సత్యవతి, చీఫ్ ఇంజనీర్ ప్రభాకర్, చీఫ్ సిటీ ప్లానర్ ప్రసాద్, సీఎంఓ హెచ్ రత్నవాలి, డీసీ ఆర్ సుజనా, తదితలు పాల్గొని శుభాకాంక్షలు తెలిపరు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.