నారద వర్తమాన సమాచారం
ఒక్కరోజే 12 లక్షల గ్యాస్ బుకింగ్స్..! భయంతో ముందుగానే ఆర్డర్లు పెట్టిన ప్రజలు
దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్లపై ఆందోళన పెరగడంతో భారీగా బుకింగ్స్ నమోదయ్యాయి. సాధారణంగా రోజుకు ఉండే బుకింగ్స్ కంటే చాలా ఎక్కువగా ఒక్కరోజులోనే లక్షలాది మంది ముందుగానే LPG సిలిండర్లు బుక్ చేసుకున్నారు.
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు మరియు హార్ముజ్ జలసంధి మార్గంపై ప్రభావం పడవచ్చన్న వార్తల నేపథ్యంలో ప్రజలు భయంతో ముందుగానే సిలిండర్ బుకింగ్ చేయడం ప్రారంభించారు.
అయితే దేశంలో గ్యాస్ కొరత లేదని, సరఫరా పూర్తిగా అందుబాటులో ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అవసరం లేకుండా భయంతో ముందుగానే బుకింగ్స్ చేయవద్దని ప్రజలకు సూచించింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.









