నారద వర్తమాన సమాచారం
శేషాచలం అడవుల్లోకి చొరబడుతున్న స్మగ్లర్లను అడ్డుకున్న టాస్క్ ఫోర్స్
ఇద్దరు అరెస్టు :
కారు, రంపాలు, గొడ్డళ్లు స్వాధీనం
తిరుపతి సమీపంలోని శ్రీవారిమెట్టు వైపు ఉన్న శేషాచలం అడవుల్లోకి చొరబడుతున్న కొందరు స్మగ్లర్లను టాస్క్ ఫోర్సు పోలీసులు అడ్డుకుని, ఇద్దరిని అరెస్టు చేశారు. వారి నుంచి కారు, రంపాలు, గొడ్డళ్లు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్సు ఇన్చార్జి, తిరుపతి జిల్లా ఎస్పీ వీ. హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్పీ పీ.శ్రీనివాస్ అధ్వర్యంలో ఆర్ఎస్ఐ విష్ణువర్ధన్ కుమార్ మంగళవారం కళ్యాణీడ్యామ్ వైపు వెళ్లి శ్రీవారిమెట్టు వైపు కూంబింగ్ చేపడుతుండగా, నాగపట్ల సెక్షన్ పరిధిలో ఒక కారు నుంచి కొంత మంది వ్యక్తులు దిగడం కనిపించింది. దీంతో వారిని టాస్క్ ఫోర్సు పోలీసులు చుట్టుముట్టే ప్రయత్నం చేయగా, వారు పారిపోసాగారు. వారిని వెంబడించి ఇద్దరిని పట్టుకున్నారు. వీరిని తమిళనాడు వేలూరు జిల్లా ఆనైకట్టుకు చెందిన శక్తివేల్ (29), రాజేంద్రన్ చిన్నపయ్యన్ (53)లుగా గుర్తించారు. వారిని విచారించగా, తిరుపతి సమీపంలోని అడవుల్లో ఎర్రచందనం చెట్లను నరకడానికి అదే ప్రాంతానికి రాజశేఖర్ అనే మేస్త్రీ తమను తీసుకుని వచ్చినట్లు తెలిపారు. వారి నుంచి కారు, రంపాలు, గొడ్డళ్లను స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన శెల్వరాజ్, రాజశేఖర్, గోపి, శీను, గోవిందన్ ల కోసం గాలింపులు చేపట్టారు. అడవుల్లోని అన్ని ప్రాంతాల్లోనూ వారి కోసం జల్లెడ పట్టారు. అరెస్టయిన వారిని తిరుపతి టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషన్ కు తీసుకుని వచ్చి కేసు నమోదు చేయగా, సీఐ సురేష్ కుమార్ దర్యాప్తు చేస్తున్నారు. స్మగ్లర్లు అడవుల్లోకి వెళ్లి చెట్లను నరకకుండా సంరక్షించి, ముందస్తుగానే వీరిని పట్టుకోగలిగామని ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.