నారద వర్తమాన సమాచారం
సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు
ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ ఏ మహేష్
విజయవాడ ఇంచార్జ్ కమిషనర్ శనివారం ఉదయం తన పర్యటనలో భాగంగా నగరం మొత్తం పర్యటించి వర్షం వల్ల రోడ్ల పైన నిల్వ ఉన్న నీళ్లను ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ఎయిర్ టెక్ మిషన్స్ సాయంతో నిరంతరం శుభ్రపరుస్తుండాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
ముందుగా బెంజ్ సర్కిల్ జంక్షన్ గురునాన కాలనీ జంక్షన్ రహదారుల పై ఉన్న వర్షపునీటి నిల్వలను వెంటనే తీసివేయాలని వర్షపునీరు రోడ్ల పైన నిల్వ ఉండకుండా ఉండేందుకు సైడ్ డ్రైన కూడా ఎప్పటికప్పుడు పరిశుభ్రపరుస్తూ వర్షపు నీరు సైడ్ డ్రైన్లో ప్రవహించే విధంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా చూసుకుంటూ ఉండాలని. అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, జోనల్ కమిషనర్లు వారి వారి పరిధిలో ఫీల్డ్ లో ఉంటూ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సిబ్బందిని అప్రమత్తం చేస్తూ వర్షపు నీటి నిల్వలను శుభ్రపరచాలని ఆదేశాలు ఇచ్చారు.
ప్రజలకు, ట్రాఫిక్కు ఎటువంటి అంతరాయం కలగకుండా నగరంలో ప్రతి సర్కిల్లో వర్షపు నీటిని పరిశుభ్రపరచడమే కాకుండా పొంగుతున్న మురుగును, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిల్వలను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని ఆదేశాలు ఇచ్చారు.
ఎన్టీఆర్ సైకిల్ దగ్గర గల బందరు కాలువ మేజర్ ఔట్ ఫాల్ డ్రైన్, మహానాడు రోడ్డు మేజర్ ఔట్ ఫాల్ డ్రైన్, మహానాడు రోడ్ ఎన్. ఏ. సి ఫంక్షన్ హాల్ దగ్గరున్న రైవస్ కాలువ మేజర్ ఔట్ ఫాల్ డ్రైన్ ఎండింగ్ పాయింట్ , క్షేత్రస్థాయిలో చీఫ్ ఇంజనీర్ ఎం ప్రభాకర్ రావు తో కలిసి పరిశీలించారు. నీటి ప్రవాహానికి ఎటువంటి ఆటకం ఉండకుండా అందులో ఉన్న వ్యర్ధాలన్నీ తొలగించి వర్షపు నీరు సజావుగా వెళ్లేటట్టు చూడమని ఆదేశాలు ఇచ్చారు. మూడు సర్కిల్లో జోనల్ కమిషనర్లకు, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్లతో సమన్వయం చేసుకుంటూ తమ తమ పరిధిలో ఉన్న అని ఔట్ ఫాల్ డ్రైన్ లను, ఆ డ్రైలు ప్రవహించే చిట్టచివరి ప్రాంతం వరకు సాయంత్రం కల్లా పూడికలన్నీ తీసివేయాలని ఆదేశాలు ఇచ్చారు.
పౌర సంబంధాలు అధికారి
Discover more from
Subscribe to get the latest posts sent to your email.