నారద వర్తమాన సమాచారం
వసతి గృహాల్లో సౌకర్యాలను మెరుగుపరచాలి
ఎస్సీ హాస్టల్ ను సందర్శిస్తున్న బిజెపి రాష్ట్ర ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి నరకంటి మొగులయ్య
నారద వర్తమాన సమాచారం: భూదాన్ పోచంపల్లి, ప్రతినిధి:
ఎస్సీ హాస్టల్లో విద్యార్థుల కోసం సౌకర్యాలు మరింత మెరుగుపరచాలని బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరకంటి మొగులయ్య కోరారు.
పురపాలక కేంద్రంలో ఆదివారం బిజెపి ఎస్సీ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ ఆదేశాల ప్రకారం మేరకు ఎస్సి హాస్టల్ వసతి గృహాలపై ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరై నాయకులతో కలిసి స్థానిక ఎస్సీ బాలికల వసతి గృహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా హాస్టల్ ని పూర్తిగా సందర్శించి విద్యార్థులతో ఏర్పాటు చేస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం మాదిరిగా నేడు పనిచేస్తున్న ప్రభుత్వం వసతి గృహాలను నిర్లక్ష్యం చేయొద్దని ఆయన అన్నారు. విద్యా సంవత్సరం మొదలైన నేపథ్యంలో వసతి గృహాలలో ఇప్పటివరకు బెడ్ షీట్స్ ట్రంకు పెట్టెలు అందించలేదని ఆయన అన్నారు. ఆహార భద్రత పై అధికారులు ఎల్లప్పుడు సందర్శిస్తుండాలని నాడు భువనగిరి ఎస్సీ గురుకులంలో జరిగిన సంఘటన మరోసారి పునరుద్ధరణ కాకుండా విద్యార్థులకు అందించే ఆహార లో నాణ్యత ప్రమాణాలు పాటించి వారికి సరైన పోషకాహారుని అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీరితోపాటు బిజెపి ఎస్సీ మోర్చా జిల్లా ఇంచార్జ్ మాస శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు చేరుకు వెంకటేశం, బిజెపి అసెంబ్లీ కన్వీనర్ చిక్క కృష్ణ, పట్టణ అధ్యక్షుడు సాహెష్, జిల్లా నాయకులు బిట్ల రవి, పోతగల నరసింహ, పట్టణ మహిళా అధ్యక్షురాలు బండిరాల సుశీల, తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.