నారద వర్తమాన సమాచారం
ఆంద్రప్రదేశ్
అల్లూరి జిల్లా పెదబయలు మండలం జామిగూడలో ప్రతి ఏటా వర్షాకాలంలో గుంజివాడ వాగు దాటేందుకు గిరిజనులు
తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వైద్యం, సరుకులు కావాలన్నా వంతెన దాటి వెళ్లాల్సిన పరిస్థితి. వంతెన లేకపోవడంతో కాళ్ళు చేతులు పనిచేయని, అనారోగ్యానికి గురైన వృద్ధురాలిని ఆసుపత్రికి తరలించేందుకు వంట పాత్ర సహాయంతో వాగు దాటించారు.
ఇప్పటికైనా వంతెన నిర్మించి ఇవ్వాలని రెండు పంచాయితీల ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.








