
శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ లను శాకాంబరి రూపంలో అలంకరణ..
ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు మరియు అన్నదాన కార్యక్రమం..
నారద వర్తమాన సమాచారం కామారెడ్డి జిల్లా జూలై 30
శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ ఆలయంలో ఆషాడమాసం మంగళవారం పురస్కరించుకుని శ్రీ సర్వదేవ పరంకరణ పరంజ్యోతి భగవతి భగవాన్ల కు శాకంబరి రూపంలో అలంకరణ చేయడంతో పాటుగా ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి అన్న ప్రసాదాన్ని స్వీకరించడం జరిగింది.నేటి అన్నదాతలుగా ముదుగంటి సరళ శ్రీనివాస్ రెడ్డి కుమారుడు పూర్ణచందర్ రెడ్డి జన్మదినం మరియు కొమిరిశెట్టి దిగంబర్ పావన లు సహకరించడం జరిగింది వీరికి ఆలయ సేవకులు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ప్రణయ దాసాజీ సేవకులు ఎర్రం చంద్రశేఖర్ ఎర్రం కాంతం ఎర్రం విజయ్ కా శెట్టి ఆంజనేయులు సిద్ధంశెట్టి సంతోష్ సేవకులు పాల్గొనడం జరిగింది.








