నారద వర్తమాన సమాచారం
జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న మేజర్ డ్రైయిన్ లను ఆధునీకరించి పారిశుద్యాన్ని మెరుగుపరుస్తాం – ప్రత్తిపాటి పుల్లారావు
పట్టణంలో మురుగు నీరు ప్రధానంగా ప్రవహించే మేజర్ డ్రైయిన్ లు రెండూ జాతీయ రహదారికి ఇరువైపులా సిల్ట్ తో పూడిపోయి మురుగు నీరు ప్రవహించే పరిస్థితి లేకుండా పోయిందని,ఈ పరిస్థితిని వారంలో పరిష్కరించాలని ప్రత్తిపాటి పుల్లారావు మునిసిపల్ అధికారులను ఆదేశించారు.బుధవారం ఉదయం జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న ప్రధాన మేజర్ మురుగు కాల్వలను ఆకస్మికంగా పరిశీలించారు.Amg ఎదురుగా కుప్పగంజి వాగులోకి ప్రవహించే కాల్వను పరిశీలించారు. అనంతరం సాయి కార్తీక్ సినిమా హాలు ముందు ఓగేరు వాగులోకి ప్రవహించే మేజర్ మురుగు కాల్వ పూడిపోయిన స్థితి ని పరిశీలించారు. అనంతరం అసిస్ట్ ఎదురుగా ఉన్న మురుగు నీటి కాల్వను పరిశీలించడం జరిగింది.అక్కడ స్థానికులు పాముల సంచారం ఎక్కువగా ఉందని ఫిర్యాదు చేశారు.అనంతరం గడియార స్తంభం సెంటర్ వద్ద జరుగుతున్న అన్నా క్యాంటీన్ పునరుద్ధరణ పనులను పరిశీలించారు. అనంతరం చేపల మార్కెట్, మటన్ మార్కెట్ షాపులను సందర్శించి, నిర్మాణం ఆగిపోయిన సదరు ప్రాంగణాన్ని పరిశీలించారు. అనంతరం గాంధీ పార్కు ను సందర్శించడం జరిగింది.ఈ సంధర్భంగా ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ పట్టణ పారిశుద్యానికి ప్రధాన వనరులైన జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న రెండు మేజర్ డ్రైయిన్ లలో సిల్ట్ ను తక్షణమే తీయించే విదంగా పనులు మొదలు పెట్టాలని, జాతీయ రహదారుల అధికారి పార్వతీశం తో సమస్య పై ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడగా, వారు మేజర్ డ్రైన్ అంచనాలు తయారు చేసి NHAI వారికి పంపాలని తెలిపారు. ఆగష్టు 15 వ తారీఖు నుండీ పట్టణంలో 3 అన్నా క్యాంటీన్ లను ప్రారంభించనున్నట్లు తెలిపారు. మటన్ మార్కెట్ నిర్మాణాన్ని ఒక ప్రణాళికా బద్ధంగా పూర్తి చేద్దామని షాపుల యజమానులకు భరోసా ఇచ్చారు.గాంధీ పార్కు ను ఆధునీకరించి , వాకింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేయాలని, గ్రీనరీని పెంచాలని అధికారులను ఆదేశించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.