బంగ్లాదేశ్ హిందువులపై దాడులు సిగ్గుమాలిన చర్య
.బంగ్లాదేశ్ జాతీయ జెండా దగ్ధం చేసిన బిజెపి నాయకులు
నారద వర్తమాన సమాచారం
అర్మూర్,
భారతీయ జనతా పార్టీ ఆర్మూరు పట్టణ శాఖ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న అరాచకాలకు, దాడులకు నిరసనగా అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆ దేశం యొక్క జాతీయ జెండాను దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ నరసింహారెడ్డి, ఆర్మూర్ పట్టణ శాఖ అధ్యక్షుడు ద్యాగ ఉదయ్ మాట్లాడుతూ బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల కోసం జరుగుతున్న ఉద్యమంలో అనవసరంగా హిందూ ఆలయాలను ధ్వంసం చేయడం, హిందువుల ఇండ్లను లూటీ చేయడం సిగ్గుమాలిన చర్య అని, ఆ దేశ ప్రధాని షేక్ హసీనా ఏ దేశం కూడా రానీయడానికి అనుమతించలేదని కానీ ప్రపంచ శాంతిని కోరుకునే భారతదేశం పెద్ద మనసుతో ఆమెకు దేశంలో రావడానికి అనుమతి కల్పించిన భారతదేశమని అన్నారు. ఇకనైనా ఆ దేశ పౌరులు హిందువులపై అరాచకాలను ఆపాలని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఇట్టి కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఆకుల శ్రీనివాస్ ,జిల్లా అధికార ప్రతినిధులు కలిగొట గంగాధర్ ,జెస్సు అనిల్, బీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు యామాద్రి భాస్కర్ ,బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మందుల బాలు, బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి పులి యుగంధర్ ,బీజేవైఎం నాయకులు కలిగొట ప్రశాంత్ ,ఉదయ్ గౌడ్, భరత్ ,జగిర్దార్ శ్రీనివాస్, అరె రాజేశ్వర్ ,విజయానంద్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








