Tuesday, May 26, 2026
spot_img

వినియోగదారుల రక్షణ చట్టంపై ప్రతి వ్యక్తి చైతన్యం కావలి – జాతీయ వినియోగదారుల సమాఖ్య ఉపాధ్యక్షులు – డా!! చదలవాడ హరిబాబు

నారద వర్తమాన సమాచారం

వినియోగదారుల రక్షణ చట్టంపై ప్రతి వ్యక్తి చైతన్యం కావలి – జాతీయ వినియోగదారుల సమాఖ్య ఉపాధ్యక్షులు – డా!! చదలవాడ హరిబాబు

చిత్తూరు :

ఇది కలియుగం కాదు కల్తి యుగం అని, అందువల్ల ప్రతి వ్యక్తి తినే ఆహార పదార్ధాల గురించి తెలుసుకొని చైతన్యవంతులు కావాల్సిన అవసరం వుందని కృష్ణవేణి గవర్నమెంట్ జూనియర్ కాలేజీ, పి,సి,ఆర్, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ, ఓకేషనల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ లలో స్టూడెంట్స్ కన్స్యూమర్ క్లబ్ లను జాతీయ వినియోగదారుల సమాఖ్య ఉపాధ్యక్షులు డా!! చదలవాడ హరిబాబు ప్రారంభించి ప్రసంగిస్తూ అన్నారు. సివిల్ సప్లయిస్ ఎ.ఎస్.ఓ. రాజు అద్యక్షతన జరిగిన వినియోగదారుల అవగాహనా సదస్సులో హరిబాబు మాట్లాడుతూ ఫాస్ట్ ఫుడ్స్, బర్గర్, పిజ్జాలు వంటివి విద్యార్ధులు తిని అనారోగ్యముతో ఆసుపత్రులపాలు అవుతున్నారని ఆవేదన చెందారు. స్ట్రీట్ వెండర్స్ వారికి ఆహార భద్రతా నియంత్రణ శాఖ వారు సమావేశపరిచి వారు వాడే కలర్స్ మరియు టేస్టింగ్ సాల్ట్ ఎక్కువ మోతాదులో వాడకూడదని శిక్షణ ఇవ్వాల్సిన అవసరముందన్నారు. ఎ.ఎస్.ఓ. రాజు మాట్లాడుతూ చౌక ధరల దుకాణాల ద్వార ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఫోర్టిఫైడ్ రైస్ లో బి12, ఫోరిక్ యాసిడ్, ఐరన్ వంటివి ఉంటాయని, ఆడవారికి బాలింతలకు మంచి బలమైన ఆహరం అయినందున రేషన్ బియ్యం అమ్ముకొని నష్ట పోవద్దని అన్నారు. జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్స్ శ్రీదేవి, అబ్దుల్ ముజీద్, మహేష్, తూనికలు కొలతల ఇన్స్పెక్టర్లు దివ్య, ఆహార నియంత్రణా అధికారి బృలక్షి పాల్గొని ప్రసంగించారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading