నారద వర్తమాన సమాచారంపల్నాడు జిల్లా పోలీస్,పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసి, ఇటీవల స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్పోలీసు స్టేషన్ తనిఖీలో భాగంగా స్టేషన్ నిర్వహణ, సిబ్బంది పని తీరు, విధులు, ముఖ్యమైన కేసుల దర్యాప్తు, స్టేషన్ లో నిర్వహిస్తున్న కేసు డైరీ, మరియు వివిధ క్రైమ్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.
అనంతరం పోలీసు స్టేషన్ పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఫిర్యాదులతో మాట్లాడి వారి సమస్యను అడిగి తెలుసుకుని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం అని చెప్పిన ఎస్పీ
అనంతరం పోలీస్ స్టేషన్ ప్రక్కనే ఉన్న OSD ఆఫీసును పరిశీలించిన ఎస్పీ
పిడుగురాళ్ల పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. రోడ్డు భద్రతా నియమాల ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలి. డ్రంకన్ డ్రైవ్ మరియు రోడ్డు భద్రతా నియమాలపై ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించాలనీ సూచించారు.
పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలక్షన్ సమయంలో నమోదైన కేసులను మరియు పాత గ్రేవ్ కేసులను సమీక్షించారు.
అదే విధంగా పోలీసు స్టేషన్ పరిధిలో గల స్కూల్స్ వద్ద , హాస్టల్ల్స్ లాంటి ప్రదేశాలలో నిఘా ఏర్పాటు చేయాలని, ఎక్కువగా విజిబుల్ పోలీసింగ్ చేయాలని, సమర్థవంతమైన నేర నియంత్రణ, నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.
జిల్లాలో గంజాయి నిర్మూలనకై కృషి చేయాలని దానికి గాను ప్రత్యేక టీమ్స్ పెట్టి గంజాయి అమ్ముతున్న తాగుతున్న వారిపై నిఘా పెట్టీ అటువంటి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అదే విధంగా రాత్రి మరియు పగలు బీట్ల పని తీరును నిరంతర మానిటరింగ్ చేయాలని, అప్పుడు నేరాలు తగ్గుతాయని తెలిపారు.
అదే విధంగా రౌడీ షీటర్ల కదలికలు మరియు కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, నేరాల అడ్డుకట్టకు నైట్ బీట్ వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు.
అనంతరం ఇటీవల రోడ్డు ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి అక్కడ రోడ్డు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యలు గురించి పిడుగురాళ్ల పోలీసు వారికి సూచించిన ఎస్పీ ……,
Discover more from
Subscribe to get the latest posts sent to your email.