నారద వర్తమాన సమాచారం
తిరుపతి లడ్డూ వివాదం: ఏమాత్రం తగ్గని అమ్మకాలు
తిరుపతి:
తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాదం పై వివాదం చెలరేగుతున్న వేళ ఆసక్తి కర విషయం తెలిసింది.ఈ నెలలో నాలుగైదు రోజులు గా తిరుమల లడ్డు ప్రసాదా నికి ఫుల్ల్ డిమాండ్ పెరిగిపో యిందట?
లడ్డు తయారీకి ఉప యోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిం దనే విషయం వెలుగు చూసిన తర్వాత కూడా అమ్మకాలు ఏ మాత్రం తగ్గలేదు. ఈ నెల 19 నుంచి 25 మధ్య అంటే వారం రోజుల్లో 23 లక్షల లడ్డూలు విక్రయాలు జరిగాయని,తిరుమల తిరుపతి దేవస్థాన అధికా రులు చెబుతున్నారు.
సగటున ఒక్క రోజుకు 3.28 లక్షల లడ్డూలు అమ్మారు. నెయ్యి కల్తీ అంశం బయటకు రావడంతో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నుంచి నందిని బ్రాండ్ నెయ్యిని టీటీడీ కొనుగోలు చేస్తోంది. 2023 వరకు ఇదే బ్రాండ్ నెయ్యిని టీటీడీ ఉపయోగించింది.
ఏఆర్ డెయిరీపై తిరుపతి లో కేసు లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వుందని తేలడంతో ఆ నెయ్యిని సరఫరా చేసిన ఏఆర్ డెయిరీకి ఫుడ్ సెఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా షోకాజ్ నోటీస్ జారీ చేసింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.