Friday, November 22, 2024

34 సంవత్సరంలు ప్రభుత్వ సర్వీస్ పూర్తయిన సందర్భంగా ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ కు ఘన సత్కారం

నారద వర్తమాన సమాచారం

34 సంవత్సరంలు ప్రభుత్వ సర్వీస్ పూర్తయిన సందర్భంగా ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ కు ఘన సత్కారం

వైద్య ఆరోగ్య శాఖలో వివిధ హోదాల్లో పనిచేసే 34 సంవత్సరంలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని 35వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ ను క్రోసూరు పీహెచ్సీ సిబ్బంది శాలువా బొకేతో ఘనంగా సన్మానించారు మొదటిగా కేక్ కట్ చేయించారు ఈ సందర్భంగా వైద్యాధికారులు డాక్టర్ సిరి చందన, డాక్టర్ మహమ్మద్ సాద్, డాక్టర్ ధనుష్ లు శాంసన్ కు శాలువా, బొకేలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వైద్యాధికారులు మాట్లాడుతూ విధి నిర్వహణ ఘనతకు మార్గమని శాంసన్ వైద్య ఆరోగ్య శాఖలో మరిన్ని ప్రమోషన్లు పొందాలని పేద ప్రజలకు ఉపయోగపడాలని వారు అభిలాషించారు పెదకూరపాడు, సత్తనపల్లి, తాడికొండ నియోజకవర్గాల్లో శాంసన్ వైద్య ఆరోగ్య శాఖలో వివిధ హోదాల్లో పని చేస్తూ సాంఘిక సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రభుత్వ వైద్య ఆరోగ్య కార్యక్రమాలను ప్రజల ముంగిటకు తీసుకొని వెళ్ళుటకు ఆయన చేస్తున్న కృషి అభినందించదగినదని కొనియాడారు సేవా తత్పరులను నిరంతరం గౌరవించాలని పేర్కొన్నారు ప్రభుత్వ జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు కు నిత్యం కృషి చేస్తున్న శాంసన్ ను సత్కరించటం ఆనందంగా ఉందన్నారు ఈ సందర్భంగా శాంసన్ మాట్లాడుతూ తనకు జరిగిన సన్మానం పట్ల కృతజ్ఞతలు తెలిపారు భవిష్యత్తులో వైద్య ఆరోగ్య శాఖలో తన వంతుగా సేవలందించడానికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు ఇక ముందు కూడా ఇదే స్ఫూర్తితో మరింత సేవా దృక్పథంతో ఆరోగ్య శాఖలో తన వంతు సేవలు కొనసాగుతాయని శాంసన్ స్పష్టం చేశారు ప్రధానంగా ఉన్నత అధికారుల ప్రోత్సాహం, సిబ్బంది సహకారం, ప్రజల సహకారంతో తన ప్రభుత్వ సర్వీస్ సక్సెస్ ఫుల్ కెరీర్ కు పునాది వేసినట్లు శాంసన్ తెలిపారు ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు ధనుష్ మహమ్మద్ షాద్ సిరి చందన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సాంబశివరావు ఆరోగ్యపరివేక్షకురాలు అమర జ్యోతి స్టాఫ్ నర్స్ లు అంజమ్మ, వీరయ్య ఫార్మసిస్ట్ ఫాతిమా బేగం ఆరోగ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version