Friday, May 8, 2026
spot_img

ఈ రోజు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం

నారద వర్తమాన సమాచారం

ఈ రోజు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం

ఏపీలో సచివాలయంలో ఈ రోజు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది.

కీలకమైన వివిధ ప్రతిపాదనలపై చర్చించనున్న రాష్ట్ర మంత్రివర్గం

వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్లో స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపుపై కేబినెట్ నిర్ణయించే అవకాశం

చెత్త పన్ను రద్దు ప్రతిపాదనపై చర్చించి నిర్ణయం తీసుకోనున్న రాష్ట్ర మంత్రివర్గం

13 కొత్త మున్సిపాలిటీల్లో 190 కొత్త పోస్టుల భర్తీ ప్రతిపాదనపై చర్చించనున్న కేబినెట్

రాష్ట్రంలోని వివిధ దేవాలయాలకు పాలక మండళ్ల నియామకంలో చట్ట సవరణకు కేబినెట్ ముందుకు రానున్న ప్రతిపాదన

దేవాలయాల పాలక మండలిని 15 మంది నుంచి 17 మందికి పెంచే ప్రతిపాదనపై చర్చించి నిర్ణయం తీసుకోనున్న కేబినెట్

పాలక మండళ్లలో ఇద్దరు బ్రాహ్మణులను సభ్యులుగా నియమించే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం

దేవాలయాల్లో ఛైర్మన్ సహా 17 మంది పాలక మండలి సభ్యుల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం

రూ.5లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న 1200 పైచిలుకు దేవాలయాల్లో ఈ నియామకాలు చేపట్టాలని యోచిస్తున్న ప్రభుత్వం

రాష్ట్ర శాసనసభ నిర్వహణ, ఆర్థిక సంవత్సరంలో మిగిలిన ఆరు నెలల కాలానికి బడ్జెట్ ప్రవేశ పెట్టే అంశంపై చర్చించే అవకాశం

మల్లవల్లి పారిశ్రామిక పార్కులో భూ కేటాయింపుల విషయమై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version