నారద వర్తమాన సమాచారం
గుంటూరు, పల్నాడు జిల్లాలో ఏడు చోట్ల రైస్ మిల్లుల తనిఖీలు
1000 మెట్రిక్ టన్నులపిడిఎస్ బియ్యం పట్టివేత,క్రిమినల్ కేసు నమోదు
గుంటూరు,పల్నాడు జిల్లాలో 7 రైస్ మిల్లులను ఆకస్మిక తనిఖీ చేసిన సివిల్ సప్లై మంత్రి నాదెండ్ల మనోహర్.
కష్ట కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు అందించే ఉచిత బియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
అదేవిధంగా సబ్సిడీ ధరలపై కందిపప్పు,పంచదార, పామాయిల్, అందిస్తున్నట్లు తెలిపారు.
ప్రజలు ప్రభుత్వాన్ని ఇస్తున్న ఉచిత బియ్యం, సద్వినియోగం చేసుకోవాలి.
ఏపీలో సూపర్ సిక్స్ హామీ నిలబెట్టుకుంటున్న కూటమి సర్కార్
దీపం -2 పధకం క్రింద అర్హులైన కుటుంబాలు వారు తమ మొదటి సిలిండర్ పొందడం కోసం అక్టోబర్ 29 వ తేదీ నుంచి 31 మార్చి 2025 వరకూ బుక్ చేసుకునే అవకాశం.
ఉచిత సిలిండర్ కావాల్సిన వారు సాధారణ పద్ధతిలో ముందుగా సొమ్ము చెల్లించవలసి ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో
బుక్ చేసిన 24 గంటల లోపు, గ్రామీణ ప్రాంతాల్లో 48 గంటల లోపు గ్యాస్ డెలివరీ ఇస్తారు.ఆ తర్వాత సిలెండర్ డెలివరీ అయిన 48 గంటల్లోపు చెల్లించిన పూర్తి సొమ్మును లబ్దిదారుల ఖాతాల్లో తిరిగి జమ చేస్తారు.
ఒక సంవత్సరంలో 3 గ్యాస్ సిలిండర్లు ఇలా ఉచితంగా పంపిణీ చేస్తారు. అయితే వీటిని ఒకేసారి కాకుండా నాలుగు నెలలకు ఒకసారి బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తారు.
ఈ దీపావళి తో ప్రారంభమయ్య పథకం పాటు ప్రతి ఏడాది
ఏప్రిల్ – జూలై (01),
ఆగష్టు –నవంబర్ (01),
డిసెంబర్ –మార్చి (01)
మధ్య మూడో సిలెండర్ బుక్ చేసుకోవచ్చు.
ఉచిత గ్యాస్ సిలిండర్ పొందడానికి అర్హతలు
1)ఎల్.పి.జి.కనెక్షన్ కలిగి ఉండటం
2) రైస్ కార్డ్,
3) ఆథార్ కార్డు
4). ఆధార్ కార్డుతో రైస్ కార్డుతో అనుసంధానం అయి ఉండాలి
ఎటువంటి సమాచారం లోపం ఉన్న టోల్ ఫ్రీ నెం.1967 కు ఫోన్ చేసి ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చు
దీపం పథకంపై ప్రతిపక్షాలు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు..
ఇప్పటివరకు దీపం 2 పథకంలో ఉచిత సిలిండర్లను బుక్ చేసుకున్న వారు 23 లక్షల మంది.. ఇందులో 16 లక్షల మందికి ప్రభుత్వం ఉచిత సిలిండర్ లను డెలివరీ చేసింది… ఇందుకుగాను ఆయిల్ కంపెనీలకు ప్రభుత్వం 84 కోట్ల రూపాయలను చెల్లించడం జరిగింది..
ప్రజలు మీడియా సహకరించాలని కోరారు.. ప్రతిపక్షాలు కావాలని చేస్తున్న చెడు ప్రచార నమ్మొద్దని కోరారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు
పల్నాడు జిల్లా సత్తెనపల్లి రామ లింగేశ్వర ట్రేడర్స్ రైస్ మిల్లు ను తనిఖీ చేసిన పౌరసరఫరా శాఖామంత్రి నాదెండ్ల మనోహర్, జాయింట్ కలెక్టర్, అధికారులు ఉన్నారు.
రైస్ మిల్లులో వందలకొద్దీ రైస్ బ్యాగుల్లో ప్రభుత్వం పంపిణీ చేసే చౌక ధరల బియ్యాన్ని గుర్తించిన మంత్రి..
రైస్ మిల్లులో దాదాపు 100 టన్నుల పిడిఎస్ రేషన్ గుర్తించిన మంత్రి..
రైసు మిల్లులో పిడిఎస్ రైస్ ను ఎందుకు గుర్తించలేదని స్థానిక ఎమ్మార్వో చక్రవర్తిని ప్రశ్నించిన మంత్రి.
జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో మెట్రాలజీ, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అధికారులు రైస్ మిల్లు ప్రతి బ్యాగ్ ని పరిశీలించాలని,పంచనామా చేసి, క్రిమినల్ ఎఫ్ఐఆర్ బుక్ చేయాలని, రైస్ మిల్లును సీజ్ చేయాలని ఆదేశించిన మంత్రి
సత్తెనపల్లి టౌన్ లో సీతారామాంజనేయ సాయి, మరియు గణేష్ రైస్ మిల్ ఫ్లోర్ మిల్,శ్రీదేవి ట్రేడర్స,రావు రైస్ మిల్ ఫ్లోర్ మిల్, కోమరపుడి గ్రామం, సత్తెనపల్లి, మండలం, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర రైస్ మిల్లు ను తనిఖీ చేసారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.