నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా, గురజాల శాసనసభ్యులు శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారి ప్రెస్ నోట్
ఐదు సంవత్సరాల వైసిపి అరాచక ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని పతనావస్థకు తీసుకువెళ్లి, రాష్ట్రంలో పరిశ్రమలు రాకుండా, ఉపాధి లేకుండా, కనీసం రోడ్ల గుంతలు కూడా పూడ్చలేని పరిస్థితుల్లో, వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న పరిస్థితుల్లో, గత ఎన్నికల్లో గెలిచిన ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి నాయకత్వంలో ఈరోజు ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే బడ్జెట్ గా ఉంది.
వ్యవసాయానికి పెద్దపీట వేయడం, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు, అదేవిధంగా నీటిపారుదలకి ప్రత్యేక నిధుల కేటాయింపు, అదేవిధంగా పంచాయతీ రోడ్లకు నిధులు కేటాయింపు, సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయింపు చూస్థావుంటే, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందు ముందు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్లే పరిస్థితి ఉంది. పారిశ్రామికంగా పురోగతి వచ్చినట్లయితే చదువుకున్న యువతకి ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగయ్యే పరిస్థితి ఉంది.
ఈరోజు శాంతి భద్రతలు కూడా పూర్తిగా రాష్ట్రంలో బాగున్నాయి కాబట్టి, ఇది అన్ని వర్గాలకి ప్రయోజనం చేకూర్చే బడ్జెట్ గా ఈరోజు ప్రజలు ఆశాజనకం వ్యక్తం చేస్తున్నారు. గత ఐదు సంవత్సరాలు పూర్తిగా నిర్లక్ష్యం వహించబడ్డ రాష్ట్ర రైతాంగానికి ఇది మంచి ఊరటనిచ్చే బడ్జెట్. బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే పూర్తి బడ్జెట్.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.