నారద వర్తమాన సమాచారం
ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రేమోన్మాది?
నంద్యాల జిల్లా:
నంద్యాల జిల్లాలో ఆది వారం అర్ధరాత్రి దారుణ ఘటన చోటు చేసుకుంది. నందికొట్కూరులోని బైరెడ్డి నగర్ కు చెందిన ఇంటర్ విద్యార్థినిపై ప్రేమించలేదనే కారణంతో ప్రేమోన్మాది పెట్రోల్ పోసి నిప్పంటిం చాడు…
ఆ తరువాత తాను కూడా నిప్పంటించుకున్నాడు. అయితే, ఈ ఘటనలో బాలిక తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణిం చగా.. ప్రేమోన్మాదికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
స్థానికులు తెలిపిన సమా చారం ప్రకారం.. బైరెడ్డి నగర్ కు చెందిన ఓ విద్యార్థి ని ఇంటర్ చదువుతుంది. కొద్దికాలంగా ఓ యువకుడు ప్రేమపేరుతో విద్యార్థిని వెంటపడుతున్నాడు. అతడి ప్రేమను యువతి అంగీకరించలేదు.
దీంతో ఆ యువకుడు నందికొట్కూరు లోని అమ్మమ్మ ఇంట్లో ఉన్న బాలిక సమాచారం తెలుసుకొని ఆదివారం రాత్రి బాలిక నిద్రిస్తున్న సమయంలో ఆమెపై పెట్రోల్ పోసిపోసి నిప్పంటిం చాడు.. ఆ తరువాత తానూ నిప్పంటించుకున్నా డు. అయితే, ఈ ఘటనకు సంబంధించిన విషయాలపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.
ఈ దారుణ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేపట్టారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.