నారద వర్తమాన సమాచారం
“చంద్రబాబుది నియంత పాలన” – కాకాణి.
చంద్రబాబు నియంత పాలనకు నిదర్శనంగా నీటి సంఘాల ఎన్నికల నిర్వహణ
తెలుగుదేశం పార్టీ శ్రేణుల దాడులు, దౌర్జన్యాలు, అధికారుల విచ్చలవిడితనం, పోలీసుల బెదిరింపులతో నీటి సంఘాలన్నీ తామే గెలుచుకున్నామంటూ నిసిగ్గుగా ప్రకటించుకున్న తెలుగుదేశం పార్టీ.
తెలుగుదేశం పార్టీ ఆగడాలు ఎన్నికల ముందే శృతిమించడంతో, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు బహిష్కరిస్తున్నామంటూ ప్రకటన.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు బహిష్కరించినా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నిలబడటానికి ఎవ్వరూ ముందుకు రాకపోయినా, సాగునీటి నిర్వహణకై ఆసక్తి ఉన్న రైతులు, ప్రాతినిధ్యం వహించడానికి ముందుకు రావడంతో, తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇష్టారాజ్యంగా దాడులు నిర్వహించడం అన్యాయం.
మిత్రపక్షాలైన జనసేన, బిజెపీ పార్టీ అభ్యర్థులను కూడా విడిచిపెట్టకుండా దాడులకు పూనుకోవడం గమనార్హం.
నెల్లూరు నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన మాజీ మంత్రివర్యులు మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా౹.కాకాణి గోవర్ధన్ రెడ్డి
మాజీ మంత్రి కాకాణి కామెంట్స్..:
సాగునీటి సంఘాల ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం నిబంధనలను పాటించకుండా, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ, ప్రశ్నించిన వారిపై.. దౌర్జన్యాలకు పాల్పడింది..
ఎన్నికలు నిర్వహిచడం కూడా అధికారులకు టిడిపి ప్రభుత్వంలో చేతకాలేదు..
భూములున్న రైతులకు ఓట్లు లేకుండా చేసి, ఓటరు లిస్టులను ఉద్దేశ్యపూర్వకంగా లోపభూయిష్టంగా తయారు చేశారు..
రైతులు నామినేషన్ వేసేందుకుNOC కోసం VRO ల దగ్గరికి పోతే, వారు సంతకం పెట్టకుండా నిరాకరించారు..
టీడీపీ నేతలు బెదిరింపులు, దాడులు, దౌర్జన్యాలు చేసి.. ఎన్నికల్లో గెలిచినట్లు ప్రకటించుకున్నారు.
సీక్రెట్ బ్యాలెట్ పెట్టమని హైకోర్టు చెప్పినా.. అధికారులు పెదచెవిన పెట్టారు…
రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాల వారీగా అనేక ప్రాంతాలలో తెలుగుదేశం పార్టీ అరాచకాలు అన్ని, ఇన్నీ కావు.
నెల్లూరు జిల్లా, కోవూరు నియోజకవర్గం,కుడితిపాళెంలో సీక్రెట్ బ్యాలెట్ లో దళిత మహిళా రైతు ఆమారి పాపమ్మ 39 ఓట్లు సాధించినా, అంతకంటే తక్కువ, 36 ఓట్లు సాధించిన తెలుగుదేశం పార్టీకి చెందిన శ్రీనివాసులు రెడ్డి గెలిచినట్లు అధికారులు ప్రకటించారు.
నెల్లూరు జిల్లా, బోగోలు మండలం కొండయ్య అనే దళిత రైతు కొండయ్య పోటీ చేయబోతున్నాడన్న సమాచారంతో, కొండయ్యను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ రఘును అర్ధరాత్రి తీసుకొని వెళ్లి పోలీస్ స్టేషన్ లో అక్రమంగా నిర్బంధించారు.
వెంకటాచలం మండలం, కసుమూరు, కందలపాడు గ్రామాలలో రైతులను నామినేషన్లు వెయ్యనివ్వకుండా, పోలీసులు అడ్డుకున్నారు.
మనుబోలు మండలం, గురువిందపూడి, సైదాపురం మండలం గిద్దలూరు గ్రామాలలో ఎన్నికలు ప్రహసనంగా మారాయి.
ఆత్మకూరు నియోజకవర్గం, పెద్దబ్బిపురంలో జనసేనకు చెందిన అభ్యర్థుల నామినేషన్లను అధికారులు తోసిపుచ్చారు.
విజయనగరం జిల్లా, యల్.కోట మండలంలో బిజెపి అభ్యర్థి మోహన్ రావు తాను పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని అధికారుల కాళ్లు పట్టి బ్రతిమిలాడినా, కనుకరించలేదు.
గతంలో చంద్రబాబు పాలనలో నీరు – చెట్టు పధకం పేరిట విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడినట్లుగానే, ఈసారి కూడా తామే సంపాదించుకోవాలి అన్నట్లుగా ఇతరులను ఎవర్నీ పోటీలలో పాల్గొనేందుకు పోలీసుల సహాయంతో, తెలుగుదేశం శ్రేణులు అనుమతించలేదు.
తెలుగుదేశం పార్టీ వారు ఎన్నికల్లో దౌర్జన్యాలకు పాల్పడుతున్నా, మా పార్టీ బహిష్కరించింది కాబట్టి మేము ఎక్కడ జోక్యం చేసుకోలేదు.. రైతులకు అన్యాయం జరిగినందున ప్రశ్నిస్తున్నాం.
సాగు నీటిపారుదలకు విడుదలయ్యే నిధులు దోచుకోవాలనే ఉద్దేశ్యంతో టీడీపీ నేతలు కూటమి పార్టీ అభ్యర్థులకు అవకాశం ఇవ్వకుండా.. బీజేపీ, జనసేన నేతలను కూడా పోటీ చెయ్యకుండా అడ్డుకున్నారు.
మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డిగారి పై దురుసుగా ప్రవర్తించిన సిఐని చంద్రబాబుకి నిజంగా ప్రజాస్వామ్యం మీద, వ్యక్తుల మీద గౌరవం ఉంటే, ఆ సీఐ పై విచారణ జరిపించి, విధుల నుండి తొలగించాలి.
అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు, అధికారులు దగ్గరుండి చేయించే పొరపాటులకు శిక్ష అనుభవించక తప్పదు..
అధికార పార్టీకి వంతపాడే అధికారులపై భవిష్యత్తులో విచారణ తప్పదు..నేడు చేసిన పాపాలన్నీ, రేపు శాపాలుగా పరిణమిస్తాయి.
సాగునీటి ఎన్నికల్లో టీడీపీ గెలుపు అసలు గెలుపే కాదు.. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో, చంద్రబాబు జీవితంలో ఇదో చీకటి అధ్యాయం..
ఎన్నికలు పెట్టకుండా.. టీడీపీ వారినే చంద్రబాబు నామినేట్ చేసుకొని ఉంటే బాగుండేది.
ఎన్నికల అర్దాన్ని చంద్రబాబు మార్చేశాడు.. టీడీపీ నేతల దురాగతాలపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.