నారదా వర్తమాన సమాచారం
జాతీయ వినియోగ దారుల వారోత్సవాలు
పల్నాడు జిల్లా: నరసరావుపేట
జాతీయ వినియోగదారుల వారోత్సవాల్లో భాగముగా హై స్కూల్,కాలేజి స్థాయి విద్యార్ధులకు వ్యాసరచన లలో పోటీలను “వినియోగదారు న్యాయ పాలనకు వర్చ్యువల్ విచారణలు మరియు డిజిటల్ సౌకర్యం” అనే అంశము నిర్వహించారు.
ఈ రోజు డా.,బి.ఆర్.అంబేద్కర్ స్పందన హాలు నందు శ్రీయుత జిల్లా సంయుక్త కలెక్టర్, పల్నాడు వారి అధ్యక్షతన నిర్వహించిన జాతీయ వినియోగదారుల దినోత్సవం సమావేశములో హై స్కూల్ స్థాయి విద్యార్ధిని విద్యార్దులకు జాయింట్ కలెక్టర్ మరియు జిల్లా విద్యా శాఖా అధికారి, పల్నాడు వారి చేతుల మీదుగా బహుమతులను మరియు ప్రసంశా పత్రములు, మేమోంటోస్ ను అందచేయడం జరిగినది.
ఈ కార్యక్రమంలో
సంయుక్త కలెక్టర్, పల్నాడు వారు మాట్లాడుతూ పోటీలలో పాల్గొన్న విద్యార్ధిని విద్యార్దులలో ఎన్నికై ఇక్కడకు అవార్డు పొందటానికి వచ్చిన విద్యార్ధిని విద్యార్దులందరిని ప్రశంసించారు.
వస్తువు కొనుగోలు విషయములో ఏది మంచిదో ఏది చేడుదో చూచి వస్తువు కొనుగోలు చేయవలెనని, రూల్స్ అతిక్రమించిన వారిపై చర్య కొరకు కన్స్యూమర్ కోర్ట్ నందు ఫిర్యాదు చేయవచ్చునని, స్కూల్ స్థాయి నుండి ఈ వినియోగదారుల అవగాహన పెంచుకొనడం అవసరమని తెలుపుతూ జిల్లా లో తక్కువ స్థాయిలో మాత్రమే కేసులు నమోదు అవుతున్నవని, కావున వినియోగదారులలో అవగాహన పెంచి రూల్స్ అతిక్రమించిన వారిపై కేసులు పెట్టేటట్లు చూడాలని కోరినారు.
తదుపరి అసిస్టెంట్ కంట్రోలర్, లీగల్ మెట్రాలజి శ్రీయుత అల్లురయ్య మాట్లాడుతూ ప్రతి వినియోగదారుడు తూనికలు మరియు కొలతల విషయములో తగు జాగ్రత్తలు తీసుకొనవలెనని, వస్తువు కొనుగోలు విషయములో జాగ్రత్తగా చూచి కొనుగోలు చేయవలెనని డెమో రూపములో చూపినారు.
తదుపరి జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబెర్ పిల్లి యజ్ఞ నారాయణ మాట్లాడుతూ తాము వినియోగదారుల అవగాహన కొరకు కార్యక్రమము లో నిర్వహించుచున్నామని, ప్రతి వినియోగదారుడు వస్తువు కొనుగోలు చేసేటప్పుడు ఎమ్మార్పీ ధరలు మరియు గడువు ముగింపు తేది చూచి కొనుగోలు చేయవలెనని తాము విస్తృతముగా గ్రామములలోను, పట్టాణముల లోను ప్రచారం కల్పిస్తూ ఉన్నామని తెల్పినారు.
మరియు డి సి పి సి మెంబెర్ కె. మస్తాన్ రావు మాట్లాడుతూ ప్రతి వినియోగదారుడు చైతన్యవంతమై వారు కొనుగోలు చేసే వస్తువులపై బిల్లులు పొందాలని మరియు వారు చేసే వినియోగదారుల అవగాహనా సదస్సులో అధికారులు కలసి రావాలని కోరినారు.
జిల్లా పౌర సరఫరాల అధికారి, నారదముని మాట్లాడుతూ ఆన్లైన్ నందు వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు చాలా ఆప్రమత్తముగా ఉండాలని, పరిచయం లేని వ్యక్తులకు తమ వ్యక్తిగత ఓటిపి లు పంచుకొనరాదని మరియు అనధికార లింకులు ఉపయోగించరాదనీ తెల్పుతూ ప్రతి పౌరుడు ఈ విషయములలో జాగ్రత్తగా ఉండాలని తెల్పినారు.
జాతీయ వినియోగ దారుల వారోత్సవాలసమావేశములో భాగముగా కలెక్టర్, పల్నాడు వారు కాలేజీ స్థాయి విద్యార్ధిని విద్యార్దులకు బహుమతులను మరియు ప్రసంశా పత్రములు, మేమోంటోస్ నుఅందచేయడం జరిగినది.
ఈ కార్యక్రమములో జిల్లా పౌర సరఫరాల అధికారి, పల్నాడు బి. నారదముని, జిలా విద్యా శాఖాధికారిణి చంద్రకళ , సి వి ఒ లు, వినియోగదారుల ఫోరం సభ్యులు, హై స్కూల్, కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్ధిని విద్యార్దులు తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.