నారద వర్తమాను సమాచారం
కేబి అంటే కూటమి బెల్టా …! ఆ నాయకుడు పేరా..
బెల్లంకొండ :- ఓ నాయకుడు అధికార పార్టీ అండతో పార్టీ ఏదైనా పెత్తనం నాదే అంటూ కేబీ పేరుతో మండలంలో బెల్ట్ దందా సాగిస్తున్నాడు. ఆయనకు చెప్పకుండా అధికారులు కూడా ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు.మధ్యం పాలసీ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. మధ్యం అమ్మకాలు పారదర్శకంగా ఉండాలని ,కేవలం వైన్ షాపుల ద్వారా మాత్రమే అమ్మకాలు జరగాలని,ఎవరైనా బెల్ట్ షాపులు పెడితే వారి బెల్ట్ తీస్తామని స్ట్రాంగ్ మాస్ వార్నింగ్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన ఆ నాయకుడు, అదికారులు మాత్రం ముఖ్యమంత్రి ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారనటంలో ఎటువంటి సందేహమూ వలదు. అసెంబ్లీ లో జరిగే ప్రతి విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో వారి తీర్పు బలంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. బెల్లంకొండ మండల పరిధిలో ప్రతి పల్లెలో బెల్ట్ దందా జోరుగా సాగుతోంది. పల్లెలో మారుమూల తండాల్లో గ్రామాల్లో మత్తులో జోగుతున్నాయి. గ్రామాల్లో పుట్టగొడుగుల బెల్ట్ దుకాణాలు వెలుస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్ షాపులను ఏర్పాటు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అనేకమంది బెల్ట్ షాపుల్లో మద్యం కొనుగోలు చేసి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. అప్పులు చేసి తాగడంతో కుటుంబాలు వీధిన పాలవుతున్నారు. మండల పరిధిలో పలు గ్రామాల్లో బహిరంగంగా బెల్ట్ షాపులు నడుస్తున్నాయి.అనుమతి పొందిన వైన్ షాప్ లో నుంచే వందల సంఖ్యలో మద్యం బాటిల్ బెల్టు దుకాణాలకు తరలిస్తున్నారని మందుబాబులు ఆరోపిస్తున్నారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు కొనసాగుతూ ఉంటే నిరోధించాల్సిన సంబంధిత శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు ఒకవైపు గుడుంబా మానేసిన వారికి ప్రభుత్వం స్వయం ఉపాధి మార్గాలతో జీవనం ఉపాధి కల్పిస్తుంటే మరోవైపు బెల్ షాపులు పల్లె ప్రజలను మత్తులో ముంచుతున్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం కన్నెత్తి చూడటం లేదని బహిరంగంగా ప్రజల ఆరోపిస్తున్నారు.
పచ్చని సంసారాల్లో చిచ్చు
మద్యం పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతుంది. ఊరు ఊరు బెల్ట్ షాపులు పుట్టగొడుగుల పుట్టుకొస్తున్నాయి. దీంతో పొద్దంతా పనిచేసే సంపాదించిన సొమ్మును మద్యానికి విచ్చేస్తూ కుటుంబాలను వీధిన పడేస్తున్నారు. గ్రామాల్లో బెల్ట్ దుకాణాలు నిర్వహించడంతో యువత పెడదారి పడుతున్నారు.
పేరుకే కిరాణం అమ్మేది మధ్యమే.!
అనేకమంది పేరుకే కిరాణం దుకాణం నిర్వహిస్తూ లోపల మాత్రం మద్యం వ్యాపారం చేస్తున్నారు. సొంత ఇళ్లలో పెద్ద ఫ్రిజ్ లో పెట్టుకొని విక్రయిస్తున్నారు. మద్యం మత్తులో ఇళ్ల మధ్యలో గొడవలు పెడుతూ అర్థరాత్రి వరకు నానా రభస చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రతి గ్రామంలో మద్యం ఏరులై పారుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు నిద్ర మత్తు వీడి నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.
బెల్లంకొండలో కేబి పేరుతో బెల్టు దందా…!
కేబి అంటే కూటమి బెల్టా …! ఆ నాయకుడు పేరా..
బెల్లంకొండ :-
ఓ నాయకుడు అధికార పార్టీ అండతో పార్టీ ఏదైనా పెత్తనం నాదే అంటూ కేబీ పేరుతో మండలంలో బెల్ట్ దందా సాగిస్తున్నాడు. ఆయనకు చెప్పకుండా అధికారులు కూడా ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు.మధ్యం పాలసీ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. మధ్యం అమ్మకాలు పారదర్శకంగా ఉండాలని ,కేవలం వైన్ షాపుల ద్వారా మాత్రమే అమ్మకాలు జరగాలని,ఎవరైనా బెల్ట్ షాపులు పెడితే వారి బెల్ట్ తీస్తామని స్ట్రాంగ్ మాస్ వార్నింగ్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన ఆ నాయకుడు, అదికారులు మాత్రం ముఖ్యమంత్రి ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారనటంలో ఎటువంటి సందేహమూ వలదు. అసెంబ్లీ లో జరిగే ప్రతి విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో వారి తీర్పు బలంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. బెల్లంకొండ మండల పరిధిలో ప్రతి పల్లెలో బెల్ట్ దందా జోరుగా సాగుతోంది. పల్లెలో మారుమూల తండాల్లో గ్రామాల్లో మత్తులో జోగుతున్నాయి. గ్రామాల్లో పుట్టగొడుగుల బెల్ట్ దుకాణాలు వెలుస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్ షాపులను ఏర్పాటు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అనేకమంది బెల్ట్ షాపుల్లో మద్యం కొనుగోలు చేసి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. అప్పులు చేసి తాగడంతో కుటుంబాలు వీధిన పాలవుతున్నారు. మండల పరిధిలో పలు గ్రామాల్లో బహిరంగంగా బెల్ట్ షాపులు నడుస్తున్నాయి.అనుమతి పొందిన వైన్ షాప్ లో నుంచే వందల సంఖ్యలో మద్యం బాటిల్ బెల్టు దుకాణాలకు తరలిస్తున్నారని మందుబాబులు ఆరోపిస్తున్నారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు కొనసాగుతూ ఉంటే నిరోధించాల్సిన సంబంధిత శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు ఒకవైపు గుడుంబా మానేసిన వారికి ప్రభుత్వం స్వయం ఉపాధి మార్గాలతో జీవనం ఉపాధి కల్పిస్తుంటే మరోవైపు బెల్ షాపులు పల్లె ప్రజలను మత్తులో ముంచుతున్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం కన్నెత్తి చూడటం లేదని బహిరంగంగా ప్రజల ఆరోపిస్తున్నారు.
పచ్చని సంసారాల్లో చిచ్చు
మద్యం పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతుంది. ఊరు ఊరు బెల్ట్ షాపులు పుట్టగొడుగుల పుట్టుకొస్తున్నాయి. దీంతో పొద్దంతా పనిచేసే సంపాదించిన సొమ్మును మద్యానికి విచ్చేస్తూ కుటుంబాలను వీధిన పడేస్తున్నారు. గ్రామాల్లో బెల్ట్ దుకాణాలు నిర్వహించడంతో యువత పెడదారి పడుతున్నారు.
పేరుకే కిరాణం అమ్మేది మధ్యమే.!
అనేకమంది పేరుకే కిరాణం దుకాణం నిర్వహిస్తూ లోపల మాత్రం మద్యం వ్యాపారం చేస్తున్నారు. సొంత ఇళ్లలో పెద్ద ఫ్రిజ్ లో పెట్టుకొని విక్రయిస్తున్నారు. మద్యం మత్తులో ఇళ్ల మధ్యలో గొడవలు పెడుతూ అర్థరాత్రి వరకు నానా రభస చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రతి గ్రామంలో మద్యం ఏరులై పారుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు నిద్ర మత్తు వీడి నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.