Wednesday, February 5, 2025

తిరుమల వ్యవహారంలో సీరియస్ అయిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు…

నారద వర్తమాన సమాచారం

తిరుమలలో విఐపి సంస్కృతి పోవాలి….

సామాన్య భక్త జనానికి ప్రాధాన్యత పెరగాలి

తిరుమల వ్యవహారంలో సీరియస్ అయిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

భక్తజనం ఎన్ని లక్షల మంది వచ్చినా సక్రమమైన రీతిలో దర్శనం చేయించే సత్తా, నిర్వహణ సామర్ధ్యం కలిగిన తిరుమల తిరుపతి దేవస్థానానికి (టిటిడి) ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు ఉన్నదని కానీ తాజాగా జరిగిన తొక్కేసులాటలో ఆరుగురు చనిపోవడం అత్యంత విషాదకరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ…

తిరుపతి తొక్కిసలాట ఘటనలోని క్షతగాత్రులను వ్యక్తిగతంగా పరామర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారికి ప్రభుత్వం తరఫున క్షమాపణలు చెప్పారు.

అదే విధంగా మరణించిన వారి కుటుంబాలకు శిరస్సు వంచి, మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పారు. తప్పు జరిగింది, మళ్ళీ జరగకుండా చూస్తాం అన్నారు.

రాష్ట్రంలో పోలీసుల విధినిర్వహణలో అలసత్వం, వైఫల్యం, నిర్లక్ష్యం ప్రస్ఫుటంగా కనబడుతోందని ధ్వజమెత్తారు.

సాక్షాత్తు డిప్యూటీ సీఎం మీడియా సమావేశపు ఏర్పాట్లు, కనీస బందోబస్తు, భద్రతా చర్యలు చేపట్టడం పోలీసులు వల్ల కావడం లేదని సూటిగా విమర్శించారు.

అదేవిధంగా తొక్కిసలాట ఘటనపై టిటిడి ఈవో శ్యామలరావు, ఏఈఓ వెంకన్న చౌదరి, టిటిడి చైర్మన్ సహా మొత్తం సంస్థ బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు.

తిరుమలలో పద్ధతులు మారాలని, సమూలంగా ప్రక్షాళన జరగాలని, అతి త్వరలో ఈ దిశగా చర్యలు చేపడతామని ప్రకటించారు.

తిరుమలలో వ్యవస్థ మొత్తం వీఐపీల సేవలో తరిస్తోందని, ఇదే విషయాన్ని భారత ఉపరాష్ట్రపతి సైతం ప్రస్తావించారని, వీఐపీ లకు కేంద్రీకృతమై పనిచేస్తున్న విధానాలు తక్షణం మార్పు చెందాలని – సామాన్య భక్తజనం దిశగా కేంద్రీకృతమై పద్ధతులన్నీ మార్చి తీరాలని పునరుద్ఘాటించారు.

భక్తులు 8 గంటలు, పదిగంటలు, 24 గంటలు ఇలా క్యూలో నిలబడటాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.

ఒకవేళ దర్శనంలో ఆలస్యం అయ్యేలా ఉంటే వారికి సరైన ప్రదేశంలో విశ్రాంతి కల్పించాల్సిందే తప్ప క్యూ లైన్లలో గంటలు గంటలు నిలబెట్టడం సరికాదని పేర్కొన్నారు.

క్షతగాత్రులందరూ కోలుకున్నాక, వారిని మరల తిరుమల తిరుపతి దేవస్థానం బాధ్యతతో వారికి స్వామివారి దర్శనం చేయించి వారిని సురక్షితంగా ఇళ్లకు చేర్చాలని సూచించారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్థ నాయకత్వంలో టీటీడీ సంపూర్ణంగా ప్రక్షాళన గావించబడి భక్తజనులకు స్వామివారి దర్శనాన్ని సునాయాసంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version