నారద వర్తమాన సమాచారం
బంగారు గనిలో ఆకలితో 100 మంది మృతి?
మూసి వేసిన గనిలోకి అక్రమంగా ప్రవేశించిన కార్మికులు దక్షిణాఫ్రికాలోని బంగారు గనుల్లో తవ్వకా లు చేపట్టేందుకు వెళ్లిన అక్రమ మైనర్లు ఆహారం, నీరు లేక ఆకలితో అలమ టిస్తూ మృత్యువాత పడుతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 100 మం ది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది.
సౌతాఫ్రికా వాయవ్య ప్రావిన్స్‌లో మూసివేసిన గనిలో ఈ ఘటన జరిగింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియోల్లో మృతి చెందిన కార్మికుల కళేబరాలు కనిపిస్తు న్నాయి. ఈ వీడియోలను జనరల్ ఇండస్ట్రీస్ వర్కర్స్ యూనియన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా జీఐడబ్ల్యూ యూఎస్ఏ విడుదల చేసింది.
ఇది విపత్కర పరిస్థితి అని ఈ సంస్థ అధ్యక్షుడు మామెట్ల్వే సెబీ ఆవేదన వ్యక్తం చేశారు. వాడుకలలో లేని స్టింఫోంటైన్ గనిలో జరిగిన ఈ దారుణాన్ని సెబీ ఊచకోతగా అభివర్ణించారు. గనిలో మృతదేహాల కుప్పలు ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నట్టు చెప్పారు.
దక్షిణాఫ్రికా ప్రభుత్వం 2023లో డిసెంబర్‌లో గని ప్రవేశాన్ని మూసివేసేందుకు ఆపరేషన్ వల ఉమగోడీ (ఆపరేషన్ క్లోజ్ ద హోల్)ని ప్రారంభించి 13 వేల మంది అక్రమ మైనర్ల గని కార్మికు లును అరెస్ట్ చేసింది.
అయితే, అరెస్ట్‌కు భయపడిన మరికొందరు కార్మికులు 2.5 కిలోమీటర్ల లోతున ఉండే స్టిల్‌ఫోంటీన్ గనిలో తలదాచుకున్నారు. దీంతో వారిని బయటకు రప్పించేందుకు ప్రభుత్వం వారికి ఆహారం, నీరు వెళ్లే మార్గాలను మూసివేసింది. దీంతో గదిలోనే చిక్కుకున్న వారు ఆకలితో అలమటి స్తూ ప్రాణాలు కోల్పోతు న్నారు.
గనిలో మైనర్లు మృత్యు వాత పడుతుండటం, వీడియోలు వైరల్ అవు తుండటంతో స్పందించిన ప్రభుత్వం రెస్క్యూ ఆపరే షన్ చేపట్టింది. తమకు సాయం చేయాలని, వెంట నే ఆహారం అందించాలని, తమను బయటకు తీసుకెళ్లాలని వేడుకుంటూ ఓ కార్మికుడు రికార్డు చేసిన వీడియో కూడా బయటకు వచ్చింది. ఇప్పటి వరకు 9 మంది మైనర్ల మృతదేహా లను వెలికి తీశారు.
26 మందిని రక్షించారు. అక్రమ మైనర్ల సమస్య దక్షిణాఫ్రికాలో దశాబ్దాలుగా ఉంది. బంగారం కోసం వీరు తమ ప్రాణాలను పణంగా పెడుతూనే ఉన్నారు. మూసి వేసిన గనుల్లోకి ప్రవేశించి బంగారం కోసం తవ్వుతూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పేదరికం, నిరుద్యోగం వారిని ఈ దిశగా పురికొ ల్పుతున్నాయి. దీనికి తోడు సిండికేట్లు కూడా ఉండనే ఉన్నాయి. ఇవి వీరికి ఆశ చూసి అక్రమంగా మైనింగ్ చేయిస్తుంటాయి.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.