నారద వర్తమాన సమాచారం
ప్రాథమిక పాఠశాలలో కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి?
కర్నూలు జిల్లా:
విద్యార్థులకు దిశ నిర్దేశం చేయవలసిన ఉపాధ్యా యులు వృత్తికే మాయని మచ్చలా ప్రవర్తిస్తున్నారు. విద్యాబుద్ధుడు నేర్పించి సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దవలసిన ఉపాధ్యాయులు కీచకు లుగా మారిపోతున్నారు..
కర్నూలు జిల్లాలో కీచక ఉపాధ్యాయుడి బాగోతం బయటపడింది, కర్నూలు జిల్లా కోడుమూరు మండలం వెంకటగిరి ప్రాథమిక పాఠశాలలో ఓ కీచక ఉపాధ్యాయుడికి బుధవారం దేహశుద్ధి చేశారు.
పాఠశాల విద్యార్థినులపై లక్ష్మన్న అనే టీచర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు సమాచారం. పాఠశాలలో ఐదవ తరగతి చదువు తున్న విద్యార్థినులను లైంగికంగా వేధించడంతో వారు తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు.
గ్రామ ప్రజలందరూ కలిసి ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసి పాఠశాల గదిలో బంధించారు. పోలీసులు పాఠశాలకు చేరుకుని తమదైన శైలిలో టీచర్‌ను విచారిస్తున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.