Thursday, March 13, 2025

తెలుగు సినిమా చరిత్రలో “అజాతశత్రువు” శోభన్ బాబు…

నారద వర్తమాన సమాచారం

తెలుగు సినిమా చరిత్రలో “అజాతశత్రువు” శోభన్ బాబు…

“సంపాదించిన ప్రతిరూపాయిని సక్రమమైనపద్దతిలో ఖర్చుచేసినప్పుడు మన కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది.”

” మనం ధానం చేసే విషయం ఇచ్చే మనచేతికి, పుచ్చుకొనే వారి చేతికి తప్ప ,మూడో చేతికి తెలియకూడదు-
శోభన్ బాబు…

ఉప్పు..శోభనాచలపతిరావు కృష్ణాజిల్లా,మైలవరం మండలం చిన్ననందిగామలో 1937 జనవరి 14 ఒక సాధారణ రైతుకుంటుంబంలో జన్మించాడు..ప్రాథమికవిద్య ,మాధ్యమిక విద్య అక్కడే పూర్తిచేసి ,కళాశాల విద్య విజయవాడలో పూర్తిచేశారు..అక్కడే నాటకాలతో పరిచయం అయింది..తన సహచర స్టూడెంట్స్ కృష్ణ,మురళీమోహన్ గార్లతో “పునర్జన్మ”అనే నాటకాన్ని వేసేవారు..అందులో మంచిపేరు రావడంతో అతని దృష్టి సినిమారంగం వైపు మళ్ళింది..ఇంతలో డిగ్రీ అయిపోవడంతో “లా” చేసేందుకు మద్రాసుకు చేరిపోయాడు..లా కంటే సినిమాలలో నటించడమే ముఖ్య ఉద్దేశంతో చైన్నై చేరడం..
అయితే 1957లోనే వివాహమైపోవడంతో తన భార్యను కూడా మద్రాసుకు తీసుకెళ్ళవలసివచ్చింది.. మొదటిలో వేషాలకోసం సైకిల్ పై స్టూడియోస్ చుట్టూ తిరిగేవారు..కానీ వేషాలు మాత్రం దొరకలేదు..ఒకరోజు యన్ టి ఆర్ గారిని కలవడం, శోభనాచలపతిరావు పేరును శోభన్ బాబుగా మార్చుకొవడం జరిగింది..అతని వినయానికి నచ్చి 1959లో యన్ టి ఆర్ ప్రక్కన చిన్నపాత్రను దైవబలం అనే సినిమాలో తీసుకోవడం జరిగింది.అయితే ఆసినిమా ఫెయిల్యూర్ అవడంతో వేషాలేకుండా పోయాయి.
కుటుంబం గడవని పరిస్థితి..ఇంటి నుండి డబ్బు అడగడం నా మోషీ..చిన్నా..చితకా వేషాలు..సినిమాకి ₹500 మించి పారితోషికం ఇవ్వడం లేదు,, పిల్లలు పుట్టారు..ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైనాయి..ఈ బాధలు భరించలేక వేషాలు రావని ఇంక తన ఊరికి వెళ్ళిపోదామని భార్యతో చెప్పాడు..భార్య అతనిని ఓదార్చింది..మీరు మంచి నటులవుతారని..ఓపిక పట్టమని థైర్యం చెప్పింది..ఒక్కొక్కసారి నీళ్ళత్రాగి పడుకొన్నరోజులెన్నో.,.1959 నుండి 1969 వరకు ఏవో కొన్ని సినిమాలలో నటించినా పేరు అతంతమాత్రమే….ఆర్థిక ఒడిదొడుగులే…
అయితే 1969లో వచ్చిన మనుషులు మారాలి సినిమాతో ఆయన జీవితం కూడా మారిపోయింది. తర్వాత బలిపీఠం,చెల్లెలికాపురం,మైనర్ బాబు,డాక్టర్ బాబు,మానవుడు దానవుడు లాంటి సినిమాలతో మంచి హీరోగా గౌరవం సంపాదించాడు..తర్వాత మంచి సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు..

ఇదే సమయంలో అతను తన జీవితాన్ని పక్కా ప్లాన్ చేసుకున్నాడు…తన సంపాధనలో అధికభాగం వ్యవసాయభూమి, ఇండ్లస్థలాలను కొనడం ప్రారంభించాడు,. తన తోటి నటీనటులతో కూడా తరుచూ ఒకమాట అంటుండేవాడు..”జనాభా పెరుగుతూవుంది..కానీ దానికి అనుకూలంగా భూమి పెరగదు.భవిష్యత్ లో భూమి విలువ చాలా పెరిగిపోతుంది..కాబట్టి మీ దగ్గర వున్న డబ్బులతో సాధ్యమైనంత ఎక్కువ భూమిని కొనిపెట్టుకోండని చెబుతుండేవాడు…మరో నటుడు మురళీమోహన్ గారు ఈయన సలహాతోనే రియల్ ఎస్టేట్ రంగం దిగాడు.,,ఈ రోజు శోభన్ బాబుగారు చైన్నై చుట్టుప్రక్కల కొనిపెట్టిన ఆస్థుల విలువే ₹80వేల కోట్ల పైగా వుందట..ఏ నటుడూ ఇంతగా సంపాదించలేదు.

శోభన్ బాబుగారు కుటుంబవిలువలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు..ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకే షూటింగ్ ..తర్వాత కుటుంబంతో గడిపేవారు..సినిమా సంగతలేవీ ఇంట్లో చర్చించేవారుకాదు.. తోటి నటీనటులకు కూడా “సాధ్యమైనంత వరకు ఎక్కువ సమయం కుటుంబంతో గడపండి..మన వృత్తి మన కుటుంబానికి ఆటంకం కాకూడదు అని చేప్పేవారట..హీరోయిన్స్ అయితే తమ వ్యక్తిగత విషయాల నుండి కుటుంబ,ఆర్థికవిషయాలన్నింటినీ అతనితో చర్చించేవారట..ఆయన ఓపికగా సలహాలు ఇచ్చేవారట. చాలామంది హీరోయిన్స్ అతనిని “జెంటల్మన్ “గానూ,పరిపూర్ణమైన భర్తగానూ అభివర్ణిస్తారు.

శోభన్ బాబుగారు నాస్థికవాది.. మథర్ థెరిస్సా ను ఆరాధించేవారు, ప్రతి సంవత్సరం ఆమె చారిటీస్ కి కోట్ల రూపాయలలో విరాళాలు పంపేవారు.
చాలామంది పేదనటులకు సహాయం చేశాడు..అయితే తన పేరు బయటకు రాకూడదని షరతు పెట్టేవాడట.రాజనాల గారు కూడా ఆయన దానగుణం గురించి పొగిడేవాడు.ఇంక ఈయనలోని మరో మంచి గుణం ఏమిటంటే తన దగ్గర పనిచేసే వారందరి భాగోగులు అతనే చూసుకొనేవాడు..వారందరికీ ఇళ్ళు కట్టించారట..వారి పిల్లలందరి చదువు ఖర్చులూ శోభన్ బాబుగారే భరించేవారట, మంచి ఉన్నత చదువులు కూడా చదివించాడని ఒకతను ఇంటర్యూలో చెప్పారు..
శోభన్ బాబుగారు తనకు చదువు చెప్పిన గురువులందరినీ తన ఇంటికి ఆహ్వానించి వారికి ఘనమైన సన్మానం చేశారట..వారికి విలువైన కానుకలు,బహుమతులు బహూకరించారట..ముఖ్యంగా హిందీ మాష్టరుగారినైతే తన ఇంట్లోనే ఆశ్రయమిచ్చాడు..
తన జీవితకాలం దాదాపు 200 ఇళ్ళు నిరుపేదలకు తన సంస్థద్వారా కట్టించారని ప్రచారము..తన సంతానాన్ని సినీరంగం సైడ్ కి రానీయలేదు…

తన కొడుకు శేషుగారితో “శేషూ మన దగ్గర పనిచేసివారు మన కూలీలు కాదు..మన ఉన్నతికి పాటుపడేవాళ్ళు….వాళ్ళ భాగోగులు చూడటం మన ముఖ్యమైన ధర్మం..అని చెబుతుండేవారు”అందుకే అతని కొడుకు ఇప్పటికీ ఆ సంస్థలను ,సేవాకార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. తెలుగు సినీ చరిత్రలో “అజాతశత్రువు”శోభన్ బాబుగారు.. అందరూ పిసినారిగా అభివర్ణించినా తనదైన ప్రణాళికతో ముందుకెళ్ళినవారు,,ఎన్నో గుప్తధానాలు చేసినవారు,తన పనివారి భాగోగులను తనే భరించిన ఉన్నత సంస్కారులు శోభన్ బాబుగారు. తను మరణించినప్పుడు స్వచ్ఛందంగా వేలాదిమంది అంత్యక్రియలకు హాజరవడం ఆయన మీద ఉన్న అభిమానానికి తార్కాణం …


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version