నారద వర్తమాన సమాచారం
స్వచ్ఛ ఆంధ్ర- స్వర్ణ ఆంధ్రా లక్ష్యంతో వ్యర్థాల నుంచి సంపద సృష్టి దిశగా అడుగులు వేద్దాం,:కలెక్టర్ పి.అరుణ్ బాబు
స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు పిలుపు ఇచ్చారు.
శనివారం స్థానిక కలెక్టరేట్ లో నిర్వహించిన స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు మాట్లాడుతూ, ఒక మంచి ఉద్దేశ్యంతో అధికారులను, సిబ్బందిని, ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. ఇదే స్ఫూర్తితో కార్యాలయంలో, ఆఫీసుల్లో పెండింగ్ ఫైల్స్ పరిష్కారం అయ్యేలా చూడాలని కోరారు. ఫైల్స్ క్లియర్ చెయ్యడం ద్వారా ప్రజలకు సత్వర సేవలు అందించాలని సూచించారు. ప్రతి మూడో శనివారం తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరారు.
తడి పొడి చెత్త సేకరణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని, ఆమేరకు ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ జిల్లా రెవెన్యూ అధికారి మురళి, కలెక్టరేట్, ఇతర శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.