నారద వర్తమాన సమాచారం
బ్యాలెట్ బాక్స్ లకు పటిష్టమైన భద్రత కల్పించాలి – జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు
SSN కళాశాలలో బ్యాలెట్ బాక్స్ ల స్వీకరణ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్*
ఫిబ్రవరి, 28: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ బాక్స్ లకు పటిష్టమైన భద్రత కల్పించాలని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు. స్థానిక SSN కళాశాలలో బ్యాలెట్ బాక్స్ లను భద్రపరిచే స్ట్రాంగ్ రూములను అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబందించి జిల్లాలో పోలింగ్ ప్రక్రియ పూర్తి అయిందని, బ్యాలెట్ బాక్స్ లకు పటిష్టమైన భద్రత కల్పించాలన్నారు. బ్యాలెట్ బాక్స్ ల స్వీకరణ కేంద్రంలోని సిబ్బంది బ్యాలెట్ బాక్స్ ల స్వీకరణ సమయంలో బాక్స్ లకు ఉన్న సీళ్లను నిశితంగా పరిశీలించాలని అనంతరం స్ట్రాంగ్ రూమ్ సిబ్బంది వాటిని నిర్దేశించిన ప్రదేశంలో చేర్చాలన్నారు. బ్యాలెట్ బాక్సులు అందించేందుకు పోలింగ్ స్టేషన్ల వారీగా కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని, కౌంటర్లలో సిబ్బంది వారికి కేటాయించిన బ్యాలెట్ బాక్సులను మాత్రమే తీసుకోవాలన్నారు. ఇందుకోసం హెల్ప్ డెస్క్ లను కూడా ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. బ్యాలెట్ బాక్సుల స్వీకరణ కేంద్రంలో సిబ్బందికి అవసరమైన త్రాగునీటిని అందుబాటులో ఉంచాలని, ఆహరం, అల్పాహారాలను ఎప్పటికప్పుడు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.