నారదా వర్తమాన సమాచారం
నరసరావు పేట లోని ఇంటర్మీడియట్ వ్రాత పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు, ఐపీఎస్.
పల్నాడు జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా పటిష్ఠ చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు ఐపీఎస్ అదేశించారు.
పల్నాడు జిల్లా నందు 48 సెంటర్ల నందు ఈ రోజు ఉదయం నుంచి ప్రారంభమైన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల నేపధ్యంలో నరసరావు పేట పట్టణం లోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని జిల్లా ఎస్పీ తనిఖీ చేసారు.
ఈ సందర్భంగా ఎస్పీ ఇంటర్మీడియట్ వ్రాత పరీక్షలలో అభ్యర్థులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు విధులు నిర్వర్తించాలన్నారు.
పరీక్షలు పూర్తయ్యేవరకు అధికారులు మరియు సిబ్బంది అందరు అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని సూచించారు.
అభ్యర్థులకు నిర్దేశించిన సమయం లోపు పరీక్ష కేంద్రాల లోనికి అనుమతించాలన్నారు. అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి సెల్ఫోన్లు,స్మార్ట్ వాచెస్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతికి వీల్లేదని అన్నారు.
పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉన్నందున అభ్యర్థులు మినహా ఇతరులను అనుమతించరాదని సూచించారు.
పరీక్షా కేంద్రాల చుట్టుపక్కల ఉండే జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లు పరీక్షలు ముగిసిన వరకు తెరవడానికి వీలు లేకుండా చర్యలు చేపట్టాలని అన్నారు.
అభ్యర్థులు మాస్ కాపీయింగ్,మాల్ ప్రాక్టీస్ వంటివి పాల్పడుకుండా పరీక్ష నిర్వాహకులు,అధికారులు సమన్వయంతో పటిష్టంగా విధులు నిర్వహించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్ష కేంద్రాల వద్ద అప్రమత్తంగా బందోబస్తు విధులు నిర్వర్తించాలని పోలీసు అధికారులు, సిబ్బందికి జిల్లా ఎస్పీ సూచించారు.
ఈ కార్యక్రమంలో పలనాడు జిల్లా ఎస్పీ తో పాటు అడిషనల్ ఎస్పీ JV సంతోష్ నరసరావుపేట 1 వ పట్టణ సీఐ MV చరణ్ పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.