నారద వర్తమాన సమాచారం
తూకం వేసే ఎలక్ట్రానిక్, ఎలక్ట్రానిక్ మిషన్లను సంవత్సరానికి ఒకసారి తనిఖీ చేసి స్టాంపింగ్ తప్పనిసరి:డాక్టర్ చదలవాడ హరిబాబు, మామిడి భీమ్ రెడ్డి
జార్ఖండ్ లోని రాంచీలో కేంద్ర ప్రభుత్వ లీగల్ మెట్రాలజీ కేంద్ర డైరెక్టర్ డాక్టర్ రాజేశ్వర్ కుమార్ ఏర్పాటుచేసిన రెండు రోజుల వర్క్ షాపులో వివిధ రాష్ట్రాల వినియోగదారుల ప్రతినిధుల సమావేశంలో సి. సి. ఐ జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ చదలవాడ హరిబాబు ప్రసంగిస్తూ ప్రస్తుతము రెండు సంవత్సరములకు ఒకసారి అధికారులు స్టాంపింగ్ చేస్తున్న రని దీనివలన వినియోగదారులు నష్టపోతున్నారన్నారు. బంగారు ఆభరణాల ఖరీదులో వ్యాపారులు క్యారెట్ రూపంలో బంగారం నాణ్యతను బిల్లులో రాయాలని అది మెజరింగ్ రూపంలో అంకెలుగా చెప్పబడుతున్నందున లీగల్ మెట్రాలజీ యాడ్ రూలు 9(5) అనుసరించి చర్యలు తీసుకునే అధికారము లీగల్ మెట్రాలజీ శాఖకు ఉండాలని, అలాగే రాష్ట్ర, జిల్లా తూనికలు, కొలతలు శాఖ అధికారులు తరచూ కొత్తగా వచ్చిన జీవోలు ఎప్పటికప్పుడు వినియోగదారుల సంఘాల ప్రతినిధులతో నిర్వహించే కార్యాచరణ రూపొందించాలని తెలంగాణ రాష్ట్ర సిసిఐ అధ్యక్షులు మామిడి భీమ్ రెడ్డి అన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.