నారదా వర్తమాన సమాచారం
సీనియర్ సిటిజన్లకు డిజిటల్ ఆధార్ కార్డులు !
గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులోకి రానున్న కొత్త సర్వీసు
ప్రభుత్వ, ప్రైవేట్ సేవలు పొందేందుకు 60 ఏళ్లు నిండిన వృద్ధులకు గుర్తింపుగా ఉండే సీనియర్ సిటిజన్ కార్డును ఇకపై రాష్ట్రప్రభుత్వం డిజిటల్ రూపంలో అందించనుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ డిజిటల్ కార్డు అందించేలా కొత్త సర్వీస్ తీసుకువస్తున్నారు. ఈ కార్డుతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అవేంటంటే…
వైద్య సదుపాయాలు
ఆస్పత్రుల్లో ప్రత్యేక క్యూలు, రాయితీలకు అవకాశం ఉంది. మందులు, డయాటగ్నోస్టిక్ టెస్ట్లపై ధరలు తగ్గుతాయి.
ప్రయాణంలో రాయితీలు
ఇండియన్ రైల్వే సంస్థ రైలు ప్రయా ణంలో 60 ఏళ్లు నిండిన పురుషులకు, 58 ఏళ్లు నిం డిన మహిళలకు 40 శాతం టికెట్ రాయితీ, 80 ఏళ్లు నిండిన వారికి 50శాతం రాయితీ కల్పిస్తుంది. కొన్ని ప్రైవేట్ బస్ సర్వీస్లు, ఎయిర్ లైన్స్ టికెట్ ధరలు తగ్గిస్తున్నాయి.
బ్యాంకింగ్, ఫైనాన్షియల్ ప్రయోజనాలు
సీనియర్ సిటిజన్లకు ఎఫ్ఎ, ఎస్సీఎస్ ఎస్ సేవింగ్ స్కీమ్స్ పై అధిక వడ్డీ. ఇన్కం ట్యాక్స్ మినహాయింపు (80 ఏళ్ల పైపడినవారికి రూ.50వేల వరకు)
ప్రభుత్వ ప్రయోజనాలు, పెన్షన్లు
ఇందిరాగాంధీ నేషనల్ ఓల్డేజ్ పెన్షన్ స్కీమ్ వంటి పథకాలకు అర్హత. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా పెన్షన్ స్కీమ్ లకు అవకాశం.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.