నారద వర్తమాన సమాచారం
ఏపీలో కటిక పేదరికం నుంచి బయటపడేది వీళ్లే..
ఆ గ్రామంలో పీ4 లబ్ధిదారుల పేర్లను ప్రకటించిన చంద్రబాబు
అమరావతి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీ-4 జీరో పావర్టీ అనే ప్రోగ్రామ్‌కు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రోగ్రాం కింద ఎంపిక చేసిన వారిలో పది మంది పేదల పేర్లను ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆయన లబ్ధిదారుల పేర్లను ప్రకటించడం ఇదే మొట్టమొదటిసారి.
బాపట్ల జిల్లా చినగంజాం మండలం కొత్త గొల్లపాలెంలో ఇవాళ పర్యటించిన చంద్రబాబు ఆ గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక గ్రామంలో పీ4లో గుర్తించిన పది మంది పేర్లను చంద్రబాబు ప్రకటించి, వారి జీవన స్థితిగతులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. పేదరికంతో బాధపడుతూ, కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తూ క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతున్న ఓ మహిళ ధీన పరిస్థితి గురించి తెలుసుకుని చంద్రబాబు నాయుడు తెలుసుకున్నారు.
ఆమె క్యాన్సర్ వైద్యానికి ఎంత ఖర్చు అవుతుందో అంచనా వేసి వెంటనే నిధులు రిలీజ్ చేయాలని కలెక్టర్ కు చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. పీ4లో పేదలను దత్తతకు తీసుకున్న సంపన్నుల్లో ఎవరైనా మధ్యలో చేతులెత్తేస్తే వారి స్థానంలో మరొకరు వస్తారు తప్ప తన పీ4 యజ్ఞం మాత్రం ఆగదని తెలిపారు.
రాష్ట్రంలో మాటలు చెప్పి కొన్ని రాజకీయ పార్టీలు తనను విమర్శిస్తున్నాయని చెప్పారు. వారికి చేతనైతే 100 మందిని దత్తత తీసుకుని వారి జీవితాలు బాగుచేయాలని అన్నారు. అలాచేస్తే, శాలువా కప్పి మెడలో పూలమాల వేసి సత్కరిస్తానని తెలిపారు.
పీ4 ప్రోగ్రాంలో ఫార్మా కంపెనీ అధినేత విక్రం
పీ4 ప్రోగ్రాంలో పేదలను దత్తత తీసుకునేందుకు ఫార్మా కంపెనీ అధినేత విక్రం నాగేశ్వరరావు ముందుకు వచ్చారు. ఇంజనీరింగ్ చదవాలనే కోరిక ఉన్న ఓ పేద 9వ తరగతి విద్యార్థిని చదివించడంతో పాటు గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఆదుకునే బాధ్యతను ఆయన తీసుకున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.