నారద వర్తమాన సమాచారం
నేరాలను అరికట్టడానికి విజిబుల్ పోలీసింగ్ ఏర్పాటుచేసిన : పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు, ఐపిఎస్.,
పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఈరోజు సాయంత్రం వినుకొండ టౌన్ మరియు చిలకలూరిపేట రూరల్ పరిధి నందు విజిబుల్ పోలీసింగ్ నిర్వహించడం జరిగింది.
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడం జరుగుచున్నది.
ప్రజలకు భద్రతపై భరోసా కల్పిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు సమాజంలో జరిగే వ్యక్తిగత, ఆర్థిక, భద్రత పరమైన నేరాల పట్ల ప్రజల్లో అవగాహన కలిగీస్తూ జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ SHO లు ప్రతి రోజు సాయంత్రం ముఖ్యమైన కూడళ్ళలో, ప్రజలతో రద్దీగా ఉండే ప్రదేశాలలో విజుబుల్ పోలీసింగ్ నిర్వహించాలని, దీనివలన నేరాలు నియంత్రించవచ్చునని తెలిపారు.
ప్రజలు సంఘముగా సంఘటితంగా ఉన్నప్పుడే ఉత్తమ ఫలితాలను సమిష్టిగా సాధించగలరనీ, అప్పుడు సంఘ అభివృద్ధితో పాటు స్వీయ అభివృద్ధి కూడా జరిగి సమాజంలో గౌరవ మర్యాదలు పెంపొందుతాయని తెలిపారు. కావున ప్రజలు పోలీస్ వారితో సమన్వయం కలిగి వారి శాంతి భద్రతల పరిరక్షణ కొరకు వారి ఆజ్ఞలను, సూచనలను పాటిస్తూ పోలీస్ వారికి సహకరించాలని తెలిపారు.
విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా వాహనాల తనిఖీలు నిర్వహించి అక్రమ మద్యం, గంజాయి, గుట్కా, మరియు ఇతర నిషేధిత పొగాకు ఉత్పత్తుల అక్రమ రవాణాను అరికట్టనున్నట్లు తెలిపారు.
మహిళల కళాశాలలు, బాలికల పాఠశాలలు, బస్టాండ్ లు, రైల్వే స్టేషన్ లు మరియు ముఖ్యమైన కూడళ్ళలో పెట్రోలింగ్ మరియు గస్తీ పటిష్టంగా నిర్వహించనున్నట్లు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే ఆకతాయిల పై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
కొందరు వాహన చోదకులు మద్యం సేవించి వాహనాలను నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, దీనివల్ల నియమ నిబంధనలు పాటిస్తూ సరైన మార్గంలో వెళుతున్న వాహనదారులు మరియు పాదచారులు కూడా ప్రమాదానికి గురికావాల్సి వస్తుందని, కావున తరచు ముఖ్యమైన కూడళ్ళలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించి మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకొని మరోసారి మద్యం సేవించి వాహనం నడపకుండా వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు.
అదేవిధంగా ఓవర్ లోడింగ్ మరియు హెల్మెట్ లేకుండా ప్రయాణించే వారి మీద మోటారు వాహనాల నూతన చట్టాల ప్రకారం అపరాధ రుసుం విధిస్తామని తెలిపినారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.