నారద వర్తమానం సమాచారం
పిల్లి నాగన్న సత్రంలో శోభాయమానంగా రాముల వారి కళ్యాణం
పల్నాడు జిల్లా నరసరావుపేట మార్కెట్ సెంటర్ పిల్లి నాగన్న సత్రంలో వెంచేసి వున్న సీతారామాంజనేయ దేవస్థానం నందు శ్రీరామనవమి పర్వదినం సందర్భంగ రాముల వారి కళ్యాణం వేడుక ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ పద్ధతిలో వేద మంత్రాలతో ఆలయ ప్రధాన అర్చకులు స్వామి వారి కళ్యాణం కనులవిందుగా నిర్వహించారు. ఆ తర్వాత భక్తులకు వడపప్పు, పానకం, ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పిల్లి రమేష్, అరుణ కుమారి, పిల్లి సుభ్రహ్మణ్యం, స్వర్ణ లత, జొరిగే ఆంజనేయులు, జ్యోతి, ముప్పాళ్ళ వంశీకృష్ణ, వైష్ణవి దంపతులు పీటల మీద కూర్చొని కమనీయంగా కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా పల్నాడు జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు పిల్లి యజ్ఞ నారాయణ, పిల్లి నాగన్న సత్రం కమిటీ సభ్యులు మిరియాల నాగ ప్రసాద్, పిల్లి నాగమునీంద్రరావు (బుజ్జీ), కాకర్ల రంగారావు మరియు ఆలయ పర్యవేక్షకులు రామిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చీరాల కొండలు, పిల్లి నాగన్న వంశీయులు పిల్లి రమాదేవి, పిల్లి కాళీ చరణ్, పిల్లి నిఖిల్, పిల్లి చందు, పిల్లి జయంత్, పిల్లి గోపి చరణ్, పిల్లి మణి, పిల్లి త్రిజేష్, పిల్లి శరన్, పిల్లి ప్రణీత్ మరియు భక్తులు పాల్గొని జయప్రదం చేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.