నారద వర్తమాన సమాచారం
వాతావరణ మార్పుల నేపథ్యంలో మున్సిపాలిటీల పరిధిలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని కమిషనర్లను ఆదేశించిన జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు ఐఏఎస్
ఈనెల 6 వ తేది నుండి 14 వ తేది వరకు ప్రత్యెక డ్రైవ్ లు నిర్వహించి డ్రైన్లను శుబ్రం చేయాలని అలానే 4 వ తేదినుండి 5 తేది వరకు ట్యాంకులు శుబ్ర పరచడం మరియు క్లోరినేషన్ ప్రక్రియలను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ .పి.అరుణ్ బాబు సంబందిత అధికారులను ఆదేశించారు. మంగళ వారం స్థానిక కలెక్టర్ కార్యాలయములోని పి.జి.ఆర్.యస్ సమావేశ మందిరములో మండల అధికారులు,మునిసిపల్ కమీషనర్లు, తదితరులతో వాతావరణంలో మార్పుల నేపధ్యంలో రానున్న రోజులలో తీసుకోవలసిన ముందస్తు చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వెక్టార్ మరియు హైజీన్ యాప్ లో వివరాలు వివరాలు త్వరితగతిన అప్లోడ్ చేయాలన్నారు. మండల పరిషత్ అధికారులు నిర్లక్ష్యం వీడి పనులు సకాలములో పూర్తీ చేయాలన్నారు. నిర్లక్ష్యం వహించిన వారిపై అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. మాన్ సూన్ సీజన్ ఈ నెల 12 నుండి మొదలు కానున్న నేపద్యములో వాతావరణములో మార్పులవలన వృద్ధులు మరియు చిన్న పిల్లల్లో ఇమ్యూనిటి తగ్గుదల వలన జలుబు, జ్వరం, దగ్గు వంటివి వస్తాయని, దానిని దృష్టిలో పెట్టుకొని ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. నీటిని నిల్వ ఉంచేట ప్పుడు దోమలు చేరకుండా తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. దోమకాటుకు గురి కాకుండా ఉండేలా పిల్లలు మరియు ముసలి వాళ్ళు అవసరమైన తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గార్బేజ్ ( చెత్త సేకరణ) ప్రతి రోజు చేపట్టాని, సంబందిత వివరాలను అప్పటికప్పుడు అప్లోడ్ చేయాలని సూచించారు. అన్ని పైపు లైనులను పంచాయాతీ రాజ శాఖ ఇంజినీరింగ్ అసిస్తేంట్ మరియు పంచాయతి కార్యదర్శి క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి ఆవసరమైన చోట మరమ్మత్తులు చేపట్టాలన్నారు. మండల పరిషత్ అధికారులు తరచుగా వారి వారి సిబ్బందితో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.దేశ వ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి విస్తరిస్తున్న నేపధ్యంలో అనుమానం ఉన్న వారు పరీక్షలు చేయించుకొని తగు జాగ్రతలు తీసుకోవాలన్నారు. జిల్లాలో అవసరమైన రాపిడి కిట్లు ఉన్నాయని, అవసరాన్ని బట్టి మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసుకోవాలన్నారు. యోగాంద్ర కార్యక్రమములో భాగంగా ఈ నెల 5 వ తేదిన నాగార్జున సాగర్ వద్ద పది వేలమందితో కార్యక్రమం నిర్వహించానున్నామాని, 4 వ తేదిన అనుపు వద్ద సుమారు వెయ్యిమంది తో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.హాట్ స్పాట్ (సమస్యాత్మక ప్రాంతాలు) లను గుర్హించి వ్యాదులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. జాయంట్ కలెక్టర్ సూరజ్ గనోరే మాట్లాడుతో సిటిజన్ రిజిస్ట్రేషన్ ఇంకా వేగ వంతం చేసి నిర్ణీత లక్ష్యాన్ని చేరుకునేలా మండల అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. మరింత మందికి శిక్షణ నిచ్చి సుక్షకులుగా చేయాలన్నారు. ఈ కార్యక్రమములో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.బి.వి.రవి, డి.సి.హెచ్.యస్ డా.ప్రసూన, డి.యల్.డి.లో వెంకట రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







