నారద వర్తమాన సమాచారం
పిడుగురాళ్ల పట్టణంలో స్టేట్ డెవలప్మెంట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళా….
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్ద(APSSDC) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారి ఆదేశముల మేరకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను రూపుమాపడానికి కృషి చేస్తున్నది. దీనిలో భాగముగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ మేళాలు నిర్వహించి ఉద్యోగాలు ఇప్పించడం జరుగుతుంది.
పల్నాడు జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి ఈ. తమ్మాజి రావు మాట్లాడుతూ, ఈ రోజు అనగా 21-06-2025 న ఏ.పి.ఎస్.ఎస్.డి.సి స్కిల్ హబ్, గవర్నమెంట్ జూనియర్ కళాశాల, పిడుగురాళ్ళ, పల్నాడు జిల్లా నందు జాబ్ డ్రైవ్ ను నిర్వింహించడం జరిగింది. ఈ జాబ్ డ్రైవ్ కు 10 కంపెనీలు హాజరు కాగా 114 మంది హాజరుఅయ్యారు అందులో 60 మంది ఉద్యోగాలకు ఏంపిక అయ్యారని తెలియజేసినారు.
ఈ జాబ్ మేళాకు ముఖ్య అతిధి, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ బి.వి. కృష్ణ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ వారు ఈ జాబ్ మేళ ను పిడుగురాళ్ళలో నిర్వహించడం చాలా సంతోషకరం అని తెలియజేశారు మరియు నియామక పత్రలు అందుకున్న యువతకు అభినందలు తెలుపుతు మరియు వారిని మరెన్ని ఉన్నత శిఖరాలను అందుకునే విధంగా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని తెలియచెసారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సిబ్బంది జిల్లా ఉద్యోగ కల్పనా అధికారి యం. రవీంద్ర నాయక్, పిడుగురాళ్ళ స్కిల్ హబ్ కోఆర్డినేటర్ పి. శ్రీకాంత్, వీరాంజినేయులు,రమ్యా, అంజి రెడ్డి, సురేష్, మస్తాన్ మరియు కంపెనీ హెచ్‌ఆర్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.