Wednesday, May 6, 2026
spot_img

గుంటూరు పాస్‌పోర్టు సేవా కేంద్రానికి జాతీయస్థాయి గుర్తింపు.

నారద వర్తమాన సమాచారం

గుంటూరు పాస్‌పోర్టు సేవా కేంద్రానికి జాతీయస్థాయి గుర్తింపు.

తొలి ఏడాదిలో కేవలం 11 దరఖాస్తులు-నాలుగేళ్లుగా 3,228 దరఖాస్తులకు పోలీస్‌ సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌.

గుంటూరు పాస్‌పోర్టు సేవా కేంద్రం సేవల్లో ఉత్తమంగా నిలిచింది. మెరుగైన ఫలితాల సాధనతో రాష్ట్రంలో ప్రథమస్థానం సంపాదించింది. జాతీయ స్థాయిలో నాలుగు ఉత్తమ పీవోపీఎస్‌కేలలో ఒకటిగా చోటు దక్కించుకుంది. పీఓపీఎస్‌కే అంటే గతంలో పాస్‌పోర్టుకు దరఖాస్తు చేయాలంటే పాస్‌పోర్టు కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది. దీనివల్ల అక్కడ రద్దీతోపాటు దరఖాస్తుదారులకూ ఇబ్బందులు ఎదురయ్యేవి.దీనికి పరిష్కారంగా తపాలాశాఖ,విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖల సమన్వయంతో ప్రతీ పార్లమెంటు నియోజకవర్గంలో ఒక ప్రధాన తపాలా కార్యాలయాన్ని ఎంపిక చేసుకుని పోస్టాఫీస్‌ పాస్‌పోర్టు సేవాకేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గుంటూరులోని చంద్రమౌళినగర్‌ తపాలా కార్యాలయంలో 2018 మార్చిలో ప్రారంభించారు.

55,604 దరఖాస్తులు: తొలి ఏడాదిలో కేవలం 11 దరఖాస్తులు స్వీకరించిన ఈ కేంద్రం ఇప్పటివరకు మొత్తం 55,604 పాస్‌పోర్టు దరఖాస్తులను ప్రాసెస్‌ చేసింది.గత నాలుగేళ్లుగా 3,228 దరఖాస్తులకు పోలీస్‌ సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ పూర్తి చేసింది. తద్వారా రూ. 1.94 కోట్ల ఆదాయం ఆర్జించింది.

ఆ నాలుగింట్లో ఒకటి:2024-25లో దేశంలోని 450 పీవోపీఎస్‌కేల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన నాలుగింటిని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఎంపిక చేసింది. ఇందులో గుంటూరు కేంద్రం కూడా ఉంది.పాస్‌పోర్టు సేవా దివస్‌ సందర్భంగా ఇటీవల దిల్లీలో అధికారులు పురస్కారం అందుకున్నారు.

రూ.7 లక్షలతో ఆదర్శంగా:రూ.7 లక్షల వ్యయంతో కొత్త కుర్చీలు, వికలాంగుల కోసం ర్యాంపులు, అంధుల కోసం ప్రత్యేకంగా మెట్లు, వృద్ధులకు వీల్‌ఛైర్లు అందుబాటులోకి తెచ్చారు. ఉన్నతాధికారుల సూచనలు, సిబ్బంది సహకారం వల్లనే ఈ విజయం సాధ్యమైందని గుంటూరు తపాలాశాఖ సూపరింటెండెంట్‌ యల్లమందయ్య తెలిపారు. ప్రస్తుతం రోజుకు 50 స్లాట్స్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, రద్దీ పెరగడంతో మరో 20 స్లాట్స్‌కు అనుమతి కోరామని వివరించారు.

ప్రజల వద్దకే పాస్​పోర్ట్​ సేవలు – ‘పాస్‌పోర్టు సేవా మొబైల్‌ వ్యాన్‌’ సిద్ధం

మరోవైపు రాష్ట్రంలో మొబైల్‌ పాస్‌పోర్టు సేవలు అందుబాటులోకి రానున్నన్నట్లు సంబంధిత అధికారులు ఇంతకుముందే తెలిపిన సంగతి తెలిసిందే.ఇందుకు అధికారులు నలుగురు సిబ్బందితో కూడిన ‘పాస్‌పోర్టు సేవా మొబైల్‌ వ్యాన్‌’ సిద్ధం చేశారు.కార్యాలయానికి వెళ్లలేని వారు,మారుమూల ప్రాంత ప్రజలు ఊరిలోనే ఉండి ఈ వ్యాన్‌ సాయంతో పాస్‌పోర్టు పొందొచ్చు.వ్యాన్‌ ఎప్పుడు, ఎక్కడికి వస్తుందో అధికారులు సంబంధిత వెబ్‌సైట్‌లో ముందుగానే పేర్కొంటారు.

పాస్‌పోర్టు తీసుకోవాల్సిన వారు ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకొని, వ్యాన్‌ వద్దకు వెళ్తే సరి. అక్కడ సర్టిఫికెట్లు పరిశీలించి, వేలిముద్రలు,ఫొటోలు తీసుకుని ప్రక్రియ పూర్తి చేస్తారు.వెరిఫికేషన్‌ పూర్తయ్యాక పాస్‌పోర్టు పోస్టులో ఇంటికే పంపించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. త్వరలో పూర్తిస్థాయి సేవలు అందుబాటులోకి తేనున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ-పాస్​పోర్ట్​తో ఎన్నో ఉపయోగాలు – వెంటనే అప్లై చేసుకోండి!


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading