నారద వర్తమాన సమాచారం
వీర బ్రహ్మేంద్ర స్వామి వారి మఠం లో భక్తుల కోసం ప్రతి శని, ఆది వారం సాయంత్రం అల్పాహార వితరణ…
మఠాధిపతి వీరధర్మజ వెంకటాద్రి స్వాములవారి చేతుల మీదుగా ప్రారంభం
బ్రహ్మంగారిమఠం,
జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠం ప్రాంగణంలోని అన్నదాన సత్రంలో ప్రతిరోజూ మధ్యాహ్నం భక్తులకు రుచికరమైన అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మఠాధిపతి వీరధర్మజ వెంకటాద్రి స్వాములవారి ఆదేశాల మేరకు, శ్రావణమాసం సందర్భంగా ప్రతి శని, ఆదివారాల్లో సాయంత్రం భక్తులు అధిక సంఖ్యలో మఠానికి తరలివస్తున్న నేపథ్యంలో వారికి అల్పాహారం అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఈ సందర్భంగా అన్నదాన సత్రంలో ఉప్మా అల్పాహార వితరణ కార్యక్రమాన్ని మఠాధిపతి వీరధర్మజ వెంకటాద్రి స్వాములవారు స్వయంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
భక్తులకు ఆధ్యాత్మిక సేవలతో పాటు అన్నదానం, అల్పాహారం అందించడం ద్వారా మఠం సేవా కార్యక్రమాలను మరింత విస్తరిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మఠాధిపతి సోదరుడు దత్తాత్రేయ స్వామి పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








