నారద వర్తమాన సమాచారం
ముంబయి రైలు బాంబు పేలుళ్లు కేసులో 12 మందికి విముక్తి బాంబే హైకోర్ట్ తీర్పు: ప్రాథమిక సాక్ష్యాల లోపం
బాంబే హైకోర్ట్ 2006 ముంబయి రైలు బాంబు పేలుళ్ల కేసులో జీవిత ఖైదు, మరణ శిక్షలు పొందిన 12 మందిని సోమవారం నిర్దోషులుగా ప్రకటించింది. ట్రయల్ కోర్టు విధించిన శిక్షలను హైకోర్టు రద్దు చేసింది. ఐదుగురికి మోకా కోర్టు విధించిన మరణశిక్షను ధృవీకరించడానికి నిరాకరించగా, ఏడుగురికి విధించిన జీవిత ఖైదును కూడా కొట్టివేసింది.
ప్రాసిక్యూషన్ ప్రాథమిక ఆధారాలు సమర్పించడంలో విఫలమైందని, నిందితులను చిత్రహింసలకు గురిచేసి నేరాన్ని ఒప్పించేందుకు బలవంతం చేశారన్న వాదనను హైకోర్టు అంగీకరించింది. గతంలోనే వాహిద్ షేక్‌ను ట్రయల్ కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. మిగిలిన 11 మంది కూడా ఇప్పుడు విముక్తి పొందారు.
2006 జూలై 11న ముంబయిలోని ఏడాది లోకల్ రైళ్లలో బాంబు పేలుళ్లు చోటుచేసుకొని 189 మంది మరణించగా, 800 మందికి పైగా గాయపడ్డారు. పేలుళ్ల వెనుక ఉగ్రవాద కుట్ర ఉందని ఆరోపిస్తూ, ముస్లింలను లక్ష్యంగా చేసుకుని పోలీసులు కేసులు నమోదు చేశారు. దర్యాప్తులో తీవ్ర లోపాలు ఉన్నాయని హైకోర్టు తీర్పుతో వెలుగులోకి వచ్చింది.
హైకోర్టు తాజా తీర్పు దర్యాప్తు సంస్థల తీరు, ఎటిఎస్ పాత్రపై అనేక ప్రశ్నలు కలిగిస్తోంది. 19 సంవత్సరాలుగా జైల్లో ఉన్న నిందితులను హైకోర్టు వ్యక్తిగత గుర్తింపు పీఆర్ బాండ్‌పై విడుదల చేయాలని ఆదేశించింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.