Thursday, July 31, 2025

నేరాల నియంత్రణే ధ్యేయంగా కార్డెన్ & సెర్చ్ ఆపరేషన్లు…. — పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపిఎస్ .

నారద వర్తమాన సమాచారం

నేరాల నియంత్రణే ధ్యేయంగా కార్డెన్ & సెర్చ్ ఆపరేషన్లు…. — పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపిఎస్ .

పల్నాడు జిల్లా నరసరావు పేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి నందు మరియు నకరికల్లు పోలీస్ స్టేషన్ పరిధి నందు శాంతి భద్రతల పరిరక్షణ చర్యలలో భాగంగా సంఘ వ్యతిరేక శక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, సామాన్య ప్రజలకు ఇబ్బందులకు గురి చేసే వారిని గుర్తించి ప్రజలకు మేమున్నాము అనే భరోసా కల్పిస్తున్నట్లు తెలిపారు.

నరసరావు పేట రూరల్ పరిధి చీకటి కాలనీ నందు నకరికల్లు పరిధి కుంకలగుంట గ్రామం నందు ఎలాంటి సంఘటనలు జరగకుండా  ఎస్పీ  ఆదేశాల మేరకు కార్డెన్ & సెర్చ్ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.

ఈ కార్డెన్ అండ్ సెర్చ్ కార్యక్రమం నందు రౌడీషీటర్లు, ట్రబుల్ మాంగర్స్, పాత కేసుల్లోని నిందితులపై ప్రత్యేక నిఘా ... ఇళ్లు, పరిసర ప్రాంతాలలో విస్తృత తనిఖీలు చేపట్టారు.

ఈ తనిఖీ లలో చీకటి కాలనీ నందు సరైన పత్రాలు లేని 25 ద్విచక్ర వాహనాలు,2 కత్తులు,

కుంకలగుంట నందు సరైన పత్రాలు లేని 36 ద్విచక్ర వాహనాలు,10 కత్తులు,2 గొడ్డళ్లు, 1 గడ్డపార స్వాధీనపర్చుకోవడమైనది.

ఫుట్ పెట్రోలింగ్, గ్రామస్తులతో సమావేశాలు నిర్వహించి వివిధ అంశాలపై అవగాహన చేశారు.

అంతేకాకుండా… రౌడీషీటర్లు, ట్రబుల్ మాంగర్స్, అనుమానితులు మరియు పాత కేసుల్లోని నిందితులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఇళ్లను తనిఖీ చెయ్యడం జరిగింది.

గ్రామంలో నాటు సారా, గుట్కా నియంత్రణ కోసం అనుమానితుల/ పాత కేసుల్లోని నిందితుల ఇళ్లల్లో… పశువుల పాకలు, గడ్డి వాము ప్రాంతాలు, దుకాణాలు, బడ్డీ కొట్లలో క్షుణ్ణంగా తనిఖీలు కొనసాగించారు.

అక్రమ మద్యం జోలికి వెళితే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు.

పాత కేసుల్లో నిందితుల తో సమావేశమై పాత పంథా కొనసాగించకుండా సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు.

ఈ చీకటి కాలనీ నందు జరిగిన కార్యక్రమంలో నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ సీఐ పసుపులేటి రామకృష్ణ , రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్సై కిషోర్ , చిలకలూరిపేట టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ రహమతుల్లా, ట్రాఫిక్ ఎస్సై వేణు ,నాదెండ్ల ఎస్సై  యడ్లపాడు ఎస్సై  మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అదే విధంగా కుంకలగుంట నందు జరిగిన కార్యక్రమంలో సత్తెనపల్లి డి.ఎస్పి M. హనుమంతరావు

సత్తెనపల్లి రూరల్ సీఐ కిరణ్ , సత్తెనపల్లి టౌన్ సిఐ నాగమల్లేశ్వర రావు , అమరావతి సీఐ అచ్చయ్య  పెదకూరపాడు సిఐ సురేష్  నకరికల్లు ఎస్సై Ch. సురేష్ , సత్తెనపల్లి రూరల్ ఎస్సై , రాజుపాలెం ఎస్సై  మరియు సిబ్బంది పాల్గొన్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version