నారద వర్తమాన సమాచారం
పిడుగురాళ్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు
పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం, పిడుగురాళ్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు పిడుగురాళ్ల పట్టణంలోని 2వ సచివాలయం (2వ వార్డు మరియు 3వ వార్డు)లోని మరియు 3వ సచివాలయం (4వ వార్డు మరియు 5వ వార్డు) లోని వితంతువు (స్పౌజు) పింఛన్(కొత్త) లబ్దిదారులకు మరియు వివిధ రకాల ఎన్టీఆర్ భరోసా పింఛన్ దారుల పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు పాల్గొని, పిడుగురాళ్ల పట్టణంలోని లబ్దిదారులకు మరియు వివిధ రకాల ఎన్టీఆర్ భరోసా పింఛన్ దారులకు పింఛన్లను పంపిణీ చేయటం జరిగింది.
ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల పట్టణ మున్సిపల్ కమిషనర్ ఇరువూరి శ్రీనివాసరావు , పిడుగురాళ్ల పట్టణ మున్సిపల్ చైర్మన్ కొత్త చిన్న సుబ్బారావు పిడుగురాళ్ల వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ తురకా వీరాస్వామి మున్సిపల్ సిబ్బంది, మరియు సచివాలయ సిబ్బంది, పింఛన్ లబ్ధిదారులు, పిడుగురాళ్ల పట్టణంలోని వివిధ హోదాల్లో వున్న కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువత, మహిళలు పాల్గొనటం జరిగింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.