నారద వర్తమాన సమాచారం
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్ బాల ఉగ్ర కుటుంబానికి రూ. కోటి చెక్కును అందజేసిన జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్, ఐపీఎస్.,
మరణించిన పోలీస్ కుటుంబానికి పోలీస్ శాఖ అన్నివిధాలుగా అండగా ఉంటుంది:జిల్లా ఎస్పీ
ప్రకాశం జిల్లా దొనకొండ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించిన కానిస్టేబుల్ యస్.బాల ఉగ్ర (G.No.2656)తేదీ:02.02.2025 న చిలకలూరి పేట జాతీయ రహదారి పై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.ఈ సంఘటనకు సంబంధించి కానిస్టేబుల్ కుటుంబానికి కందుకూరులోని స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా పోలీస్ శాలరీ ప్యాకేజి (ఆక్సిడెంటల్ డెత్ బెనిఫిట్స్) ద్వారా మంజూరైన రూ.కోటి రూపాయలు చెక్కును జిల్లా ఎస్పీ యస్.బాల ఉగ్ర సతీమణి మంజులాదేవికి మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్, ఐపీఎస్., మాట్లాడుతూ, అంకితభావంతో విధులు నిర్వహించే పోలీస్ సిబ్బందిని కోల్పోవడం పోలీస్ శాఖకు తీరనిలోటుని పేర్కొన్నారు. వారి కుటుంబాలకు పోలీస్ శాఖ అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు. బాల ఉగ్ర కుమారులు నేహంత్ (11 సం), జైనిధ్ (8 సం) ల విద్యాభవిష్యత్తుపై జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా ఆరా తీశారు. కుటుంబ పరిస్ధితులు మరియు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈరోజు అందజేసిన ఆర్థిక సహాయం ద్వారా కుటుంబానికి కొంత భరోసా కలుగుతుందనే ఆశిస్తున్నామన్నారు. కుటుంబానికి అందవలసిన అన్ని బెనిఫిట్లు, ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే, కారుణ్య నియామక ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నుండి రావలసిన అన్ని బెనిఫిట్స్ ను త్వరగా వచ్చే విధంగా ప్రత్యేక చొరవ తీసుకుంటుమనని, కానిస్టేబుల్ యొక్క కుటుంబానికి పోలీస్ శాఖ అన్నివిధాలుగా అండదండలుగా ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో DPO AO రామ్మోహన్ రావు, RI సీతారామి రెడ్డి, కందుకూరు SBI రీజినల్ మేనేజర్ వి.అప్పలరాజు తరుపున చీఫ్ మేనేజర్ డి.శ్రీనివాస్ కృష్ణ, డిప్యూటీ మేనేజర్ బి.యన్.బి.చారీ మరియు డిపిఓ సిబ్బంది పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.