నారద వర్తమాన సమాచారం
స్త్రీ శక్తి పథకం తో పాటుగా కర్నూలుకు బస్సు సర్వీసు కొనసాగించాలి..
కూటమి ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా స్త్రీ శక్తి పథకం అమలు సందర్భంగా గతంలో మాదిరిగా మాచర్ల నుండి కర్నూలుకు బస్సు ఎక్స్ ప్రెస్ ( టీమ్) సర్వీసు కొనసాగించాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఈ బస్సు కోసం డయల్ యువర్ డిఎం ప్రోగ్రాం లో ప్రయాణికులు ప్రతి నెల 30 మంది ప్రయాణికులు పైగా ఫోన్ చేసి కర్నూలు బస్సు పెట్టాలని కోరారు. దానికి డిఎం ప్రతిసారి హెడ్ ఆఫీస్ నుంచి పర్మిషన్ రాగానే మరియు నోటు పెట్టామని సమాధానాన్ని ప్రయాణికులకు సమాధానం చెబుతున్నారు. సమస్యను పక్కన పెడుతున్నారు ఎందువల్ల ప్రయాణికులకు అర్థం కావట్లేదు. దయచేసి
ఈ బస్సు సౌకర్యం లేకపోవడంతో పల్నాడు, ప్రకాశం, రాయలసీమ వాసులు మహిళలు, విద్యార్థులు, ఉద్యోగస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ బస్సు సౌకర్యాన్ని నిలిపేయడాన్ని పరిశీలించి తిరిగి యధావిధిగా ఉదయం 6 గంటలకు మాచర్ల నుండి కర్నూలుకు బయలుదేరేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి, నెల్లూరు జోనల్ 3 చైర్మన్ సురేష్ రెడ్డి, రవాణా ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, ఆర్టీసీ ఎండి ద్వారక తిరుమలరావు, నెల్లూరు జోన్ 3 చైర్మన్ సురేష్ రెడ్డి, ఈడి నాగేంద్రప్రసాద్, డి పి టి ఓ అజితకుమారి, డిపో మేనేజర్ బత్తుల వీరాస్వామి లను ప్రయాణికులు కోరుచున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








