Saturday, August 9, 2025

జర్మనీలో ఫేక్ ప్రొఫెసర్గా ఒక తెలుగు సైకో కలకలం

నారద వర్తమాన సమాచారం

జర్మనీలో ఫేక్ ప్రొఫెసర్గా ఒక తెలుగు సైకో కలకలం

భారతదేశంలో తెలుగు సాహిత్యం చదివి జర్మనీలో ప్రొఫెసర్ గా చలామణి అవడానికి ప్రయత్నించి విఫలం అవడంతో అదే రంగంలో ఉన్న సాటి తెలుగువాడి కంపెనీపై విషప్రచారం.

జర్మనీలో ఫేక్ ప్రొఫెసర్ గా ఒక తెలుగు సైకో కలకలం సృష్టించాడు

భారత దేశంలో ఒక విశ్వవిద్యాలయంలో తెలుగు సాహిత్యం చదివి జర్మనీలో ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో ‘ఏ’ఐ’ప్రొఫెసర్ గా చలామణి అవడానికి పన్నాగం పన్ని విఫలం అవడంతో అడ్డువస్తున్నాడేమో అని అదే రంగంలో మంచి పేరుగాంచిన ఇంకొక తెలుగు వాడిపై విషయం కక్కుతున్నాడు. తెలుగు వాళ్లు ని ప్రపంచాన్ని ఏలుతున్న వేల కొద్దీ మందిలో అర్హత లేని తెలుగువాడు గురించి వాడు ఎక్కువగా ఊహించుకొని చివరకు ఆ స్థాయి చేరుకోక పోవడంతో వాడి పక్కన ఉన్న సదురు తెలుగు వ్యక్తులపై దేశాన్ని కక్కుతున్నాడు దానికి వేరే తెలుగు వారు కూడా ఇతనికి ప్రోత్సహించడం శోచనీయం.

ఆంధ్రప్రదేశ్ కు చెందిన గణేష్ తొట్టెంపూడి భారతదేశంలో గల ఒక విశ్వవిద్యాలయంలో తెలుగు సాహిత్యం చదివాడు జర్మనీ ప్రభుత్వం అందించి స్కాలర్షిప్ ద్వారా తెలుగు తర్జుమా కోసం సాంకేతిక ఉద్యోగిగా జర్మనీ వెళ్ళాడు అక్కడికి వెళ్లిన తరువాత తన గురించి తాను ఎక్కువగా ఊహించుకొని జర్మనీలో కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న ఒక స్కిల్ కంపెనీ పై దృష్టి పెట్టాడు ఆ కంపెనీ యాజమాన్యంతో మంచిగా ఉన్నట్టు నటిస్తూ వారి అధికారిక కార్యక్రమాలలో పాల్గొని అక్కడికి వచ్చిన ఇంజనీరింగ్ కళాశాల యజమానులతో సంబంధాలు ఏర్పరచుకున్నాడు.

ఈ పరిచయం ఆధారంగా వారికి వ్యాపార అవకాశాలు చూపించి జర్మనీలో చదువుతున్న విద్యార్థులతో భారత దేశంలో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశాడు ఈ కార్యక్రమం కోసం తూర్పుగోదావరి జిల్లా ఒక ఇంజనీరింగ్ కళాశాల నుండి 18 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం అయితే ఆ కార్యక్రమం విఫలం కావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిధిలో విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తానని చెప్పి ఒక సెమినార్ నిర్వహించాడు ఆ సెమినార్ తర్వాత డబ్బు డిమాండ్ చేయడంతో అతన్ని పక్కన పెట్టారు

అవకాశం కోసం ఎదురుచూస్తూ తన అసమర్ధతతో వ్యాపారంలో రాణించ లేకపోయినా ఆ వ్యక్తి జర్మనీలో ఎదుగుతున్న మరో తెలుగు వ్యక్తిని చూసి అసూయ చెందాడు దీనితో గత మూడు సంవత్సరాలుగా సోషల్ మీడియా ఆధారాలు మరియు ఈమెయిల్ లను వక్రీకరించి అక్కడి నుండి వచ్చిన జవాబులను తనకి నచ్చిన విధంగా ఒక ప్రోగ్రామ్ను మరొక దానికి అనుసంధానం చేస్తూ ఆ కంపెనీపై విష ప్రచారం చేస్తున్నాడు

వ్యతిరేక స్వరం నచ్చక విసిగిపోయి ఉద్యోగిని తొలగించిన యూనివర్సిటీ యాజమాన్యం

స్వతహా తెలుగు సాహిత్యం చదివిన గణేష్ తొట్టెంపూడి అరకొర కంప్యూటర్ కోర్స్ నేర్చుకొని జర్మనీలో ఒక ప్రైవేటు యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా తనకు తాను ప్రదర్శించుకున్నాడు అక్కడితో ఆగకుండా భారత దేశంలో తెలుగు విద్యార్థులను జర్మనీకి తీసుకువెళ్లి బ్యాచిలర్ ప్రాజెక్టులో పేరుతో మరియు ఇంటర్నెట్ షిప్ పేరుతో డబ్బు వసూలు చేసి మోసం చేసినట్లు సమాచారం ఈ చర్యల కు సంబంధించిన ఆధారాలు కూడా సేకరించబడ్డాయి ఈ వ్యవహారాన్ని గుర్తించి సంబంధిత న్యాయ ప్రక్రియ ప్రారంభించి గణేష్ పై క్రిమినల్ కేసు నమోదు చేసి నట్టు తెలుస్తుంది తదనంతరము గణేష్ పని చేస్తున్న యూనివర్సిటీ కూడాఉద్యోగం తొలగించినట్లు సమాచారం

భార్యను కూడా వదిలేసి వ్యక్తిగత జీవిత పరిస్థితిని మరింత దిగజార్చుకున్నాడు

ఆ వ్యక్తి చేస్తున్న పిచ్చి వేషాలకు విసిగిపోయి సదరు తెలుగు కంపెనీ అతడి పై చట్టపరమైన చర్యలు తీసుకుంది అయితే అతను ఇచ్చిన జర్మనీ చిరునామా తప్పు అని తెలిసింది కంపెనీ అధికారులు అతనిని భార్యను సంప్రదించగా ఆమె కూడా అతన్ని పిచ్చి వేషాలకు విసిగిపోయి అతనికి దూరంగా ఉన్నట్లు సమాచారం ఇచ్చింది.
అతని సైకో చేష్టలు అక్కడితో ఆగలేదు ఆ కంపెనీ యాజమాన్యం భార్యపై తను ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో పిచ్చిరాతలు రాశాడు ఈ విషయంపై అతనిపై మరో రెండు పోలీస్ కేసులు నమోదు అయ్యాయి ఈ సమాచారాన్ని జర్మనీ రాయబార కార్యాలయాలకు కూడా తెలియజేయడం జరిగినది.

ఆగడాలకు అంతులేకుండా జర్మనీలో అక్రమమైన వలసదారుడిగా ఉంటూ తన గుర్తింపును దాచిపెట్టి గణేష్ తొట్టెంపూడి పిచ్చి పట్టిన వాడిలా ప్రవర్తిస్తున్నాడు
శ్రీలంక దేశ నెంబర్ మరియు నకిలీ ఈమెయిల్ ఐడి ల ద్వారా సదరు తెలుగు వ్యక్తి మరియు అతని కంపెనీపై నిరంతర విషం కక్కుతున్నాడు అతను చేస్తున్న ప్రచారంలో నిజం లేకపోవడంతో తన తెలుగు ప్రావీణ్యాన్ని ఉపయోగించుకొని తెలుగు రాష్ట్రాల విద్యార్థులను ఉద్ధరిస్తున్నట్టుగా నమ్మబలికి తన వైపు చూసేలా ప్రయత్నిస్తున్నాడు

ఆ కంపెనీకి నష్టం కలిగించాలనే ఉద్దేశంతో వారు చేసే ప్రతి పని పైన నిరాధారమైన ఆరోపణలు సృష్టిస్తున్నాడు ఇప్పటికీ అతనిపై పోలీసు ఫిర్యాదులు క్రిమినల్ కేసులు మరియు ఇతర చట్టపరమైన చర్యలు ఉన్నప్పటికీ అతడిని ఎవరు అడ్డుకోకపోవడం గమనర్హం
రాయబార కేంద్రాలు ఎన్ఆర్ఐ లకు మద్దతు ఇచ్చే రాజకీయ పార్టీలు కూడా ఈ విషయాన్ని నిరాకరించకపోవడం శోచనీయం దీనికి తోడు అర్హత లేక కొన్ని మీడియా సంస్థలు సహకారంతో గణేష్ విచ్చలవిడిగా కంపెనీకి నష్టాలు కలిగిస్తున్నాడు.

ఎన్నారైల వ్యక్తిగత వేషాలతో దేశ ప్రతిష్టికే ముప్పు తెచ్చే విధముగా సదరు ఈ గణేషు తన సొంత ద్వేషముతో నిండిన భావోద్వేగాలను బయటకు కక్కుతూ ప్రభుత్వం యూనివర్సిటీ కార్యక్రమాలపై కూడా విమర్శల వర్షం కురిపిస్తున్నాడు ఇటీవల కాలంలో జేఎన్టీయూ హైదరాబాదు యూనివర్సిటీ జర్మనీ యూనివర్సిటీలతో కుదుర్చుకున్న సాంకేతిక సహకార ఒప్పందం పైన కూడా గణేష్ నిరాధర విమర్శలు చేస్తూ విష ప్రచారానికి దిగాడు

ఈ రెండు యూనివర్సిటీలు రెండు పబ్లిక్ యూనివర్సిటీలు కావడంతో పాటు దశాబ్దాలు మన చరిత్ర కలిగిన విద్యాసంస్థల అయినప్పటికీ గణేష్ తన వ్యక్తిగత ద్వేషాన్ని వ్యాప్తింపజేస్తూ ఈ రెండు దేశాల మధ్య నెలకొన్న విద్యా సహకారాన్ని దెబ్బతీయాలని లక్ష్యంతో వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తుంది ఈ పరిస్థితుల్లో గణేష్ చేస్తున్న విష ప్రచారము ఒక వ్యక్తిగత అసంతృప్తిని తీర్చుకోవాలని ఉద్దేశంతో రెండు యూనివర్సిటీల మధ్యనే కాకుండా రెండు దేశాల మధ్య విద్యాపరమైన చిచ్చును రేపే ప్రమాదం కు దారి తీసేలా ఉంది
ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ కంపెనీలకు సీఈవోలుగా నాయకులుగా ఎదుగుతున్న తెలుగువారిని చూసి మనం గర్వపడుతుంటే మరోవైపు గణేష్ లాంటి వ్యక్తులు తమ అనుచిత చర్యలతో భావితరాలను అయోమయానికి గురి చేస్తున్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version