Monday, August 11, 2025

భారత్‌ ఓపిక పడితే.. ట్రంప్‌ పేకమేడ కూలడం ఖాయం: అమెరికన్‌ ఆర్థికవేత్త

నారద వర్తమాన సమాచారం

భారత్‌ ఓపిక పడితే.. ట్రంప్‌ పేకమేడ కూలడం ఖాయం: అమెరికన్‌ ఆర్థికవేత్త

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ టారిఫ్‌ వార్‌పై స్వదేశంలోనూ వ్యతిరేకత ఎదురవుతోంది. ఈ సుంకాల వల్ల అమెరికా ప్రజలకే ఎక్కువ నష్టం వాటిల్లనుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

తాజాగా అమెరికా ఆర్థికవేత్త, జాన్‌ హాప్‌కిన్స్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ స్టీవ్‌ హాంకీ కూడా ఇదేవిధమైన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. సుంకాల (Trump Tariffs) పేరుతో ట్రంప్‌ కడుతున్న పేక మేడ త్వరలోనే కూలిపోతుందని దుయ్యబట్టారు. అప్పటివరకు భారత్‌ ఆయన జోలికి వెళ్లకపోవడమే మంచిదని సూచించారు.

జాతీయమీడియా సంస్థ ఎన్డీటీవీతో మాట్లాడిన స్టీవ్‌ హాంకీ.. భారత్‌పై ట్రంప్‌ విధించిన సుంకాల (Trump Tariffs on India) అంశాన్ని ప్రస్తావించారు. ”సుంకాలపై ట్రంప్‌ నిర్ణయాలు పూర్తిగా అర్థరహితం. ఇక్కడో విషయం చెప్పాలి. ‘తనను తాను నాశనం చేసుకునే శత్రువు జోలికి వెళ్లకపోవడమే మంచిద’నేది నెపోలియన్‌ మాట. ఇప్పుడు ట్రంప్‌ (Donald Trump) కూడా ప్రపంచదేశాలతో వాణిజ్య యుద్ధాలు చేస్తూ తనను తానే నాశనం చేసుకుంటున్నారని అనిపిస్తోంది. భారత్‌ విషయానికొస్తే.. ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్రమోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్‌ కొంతకాలం ఓపిక పట్టి ఎదురుచూడాలి. ఎందుకంటే ట్రంప్‌పేకమేడ త్వరలోనే కూలిపోతుంది” అని ఆ ప్రొఫెసర్‌ అభిప్రాయపడ్డారు. అమెరికన్ల వినిమయ ఖర్చులు పెరిగితే తమ దేశ ద్రవ్యలోటు ఎక్కువవుతుందని హాంకీ అంచనా వేశారు. టారిఫ్‌లపై ట్రంప్‌ విధానాలు చాలా చెత్తగా ఉన్నాయని దుయ్యబట్టారు. దీనివల్ల తమ ఆర్థికవ్యవస్థకే నష్టం చేకూరే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.

ట్రంప్‌తో ఎలా డీల్‌ చేయాలో మోదీకి చెబుతా

రష్యా చమురును (Russian Oil) కొనుగోలు చేస్తుందన్న కారణంతో భారత్‌పై సుంకాలను ట్రంప్‌ రెట్టింపు చేసి 50శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. ఈ సుంకాల విషయం తేలేవరకు న్యూదిల్లీతో వాణిజ్య చర్చలు కూడా జరపబోమని తేల్చిచెప్పారు. దీంతో ఇరుదేశాల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. ట్రంప్‌ నిర్ణయాన్ని భారత్‌ తీవ్రంగా ఖండించింది. ఇది అన్యాయమైన, అసమంజసమైన చర్య అని పేర్కొంది. జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని న్యూదిల్లీ స్పష్టం చేసింది.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version