నారద వర్తమాన సమాచారం
ప్రపంచ పర్యాటక దినోత్సవం – 2025 న పల్నాడు ఖ్యాతి – విఖ్యాతి
🌹ఉద్యమాల పురిటిగడ్డ, పౌరుషానికి ప్రతీక, ధైర్యం, ప్రతీకారం, ఉగ్గాని, గుంత పునుగులు, నకరికల్లు వరి ధాన్యం, లాలిపురం జామకాయలు, అడిగోప్పల రేగి పళ్ళు,… ఇలా ఎన్నో రకాల అంశాలకు ప్రసిద్ధి …… మన పల్నాడు.
🌹మౌఖికంగా ఉన్న తెలుగు భాష ను “నాగబు” అనే పద రూపంలో లికిత పూర్వకంగా కనబడినది మరియు తొలి తెలుగు పదము కనబడిన శాసనం అమరావతి శాసనం ఉన్నది …… మన పల్నాడు.
🌹విధికుడు అనే చర్మకారుడు బౌద్ధ బిక్షులకు పూర్ణకుంభం బహుమతిగా ఇచ్చిన ప్రదేశం – అమరావతి ……. మన పల్నాడు.
🌹దక్కన్ ప్రాంతంలో ఉన్న పురాతన భారతీయ రాజవంశం, జనరంజక పరిపాలకులుగా, శాంతికాముకులుగా పేరు గాంచిన శాతవాహనుల రాజధాని ధరణికోట (అమరావతి)………. మన పల్నాడు.
🌹భారతదేశంలో ప్రఖ్యాతిగాంచిన 125 అడుగుల ధ్యాన బుద్ధ విగ్రహం అమరావతి……… మన పల్నాడు.
🌹 గౌతమ బుద్ధుని అవశేషాలను పూజల నిమిత్తమై నిక్షిప్తం చేసి వాటిపై కట్టిన కట్టడమే అమరావతి స్తూపం. బౌద్ధ బిక్షులకు అత్యంత పవిత్రమైన ప్రాంతం….. మన పల్నాడు.
🌹బౌద్ధ మత విశేషాలు, స్తూపాలు ,శిథిలాలు, ప్రాచీన అవశేషాలు, గ్రంధాలు సమాచారాన్ని తెలియజేసే అమరావతి మ్యూజియం………… మన పల్నాడు.
🌹ఆరామాలలో మొదటిది ప్రాచీన కళా ప్రాంగణం , ధనానికి ఆధారం ధాన్యకటకం …అమరావతి …….. మన పల్నాడు.
🌹అమరావతి కేంద్రంగా సుపరిపాలన అందించిన రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు… మన పల్నాడు.
🌹ప్రాచీన చరిత్ర కలిగిన, పరిమితి లేక ఎదిగిన స్వామి పంచారామాలలో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన అమరలింగేశ్వర స్వామి దేవాలయం అమరావతి…… మన పల్నాడు.
🌹మహాయాన బౌద్ధం పరిఢవిల్లిన గడ్డ……… మన పల్నాడు.
🌹రెండోవ బుద్ధుడు మరియు ఇండియన్ ఐన్స్టీన్ గా పేరుగాంచిన ఆచార్య నాగార్జునుని అజరామర బోధనలతో అలరారిన నేల……. మన పల్నాడు.
🌹రెడ్డి రాజుల రాజధాని, ఆంధ్ర జాతి అమరవేణి, కొండవీటి శ్రేణి… మన పల్నాడు.
🌹శ్రీనాధ కవిసార్వభూముణ్ణి కొండవీటి రాజుల విద్యాధికారిగా వెలుగొందేలా చేసిన నేల……… మన పల్నాడు.
🌹శిబి చక్రవర్తి తన తొడను కోసి కపోతాన్ని కాపాడిన క్షేత్రం కపోతేశ్వరాలయం ……. మన పల్నాడు.
🌹దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన, దేవతలే చేరిన చేజర్ల ….. మన పల్నాడు.
🌹నిగూడా శక్తుల సిద్ధ క్షేత్రం, ముచుకుంద మహర్షి తపమాచరించిన ముక్తిదామం – గుత్తికొండ బిలం. …….. మన పల్నాడు.
🌹రాజ నీతితో రాణించి, పల్నాటి యుద్ధానికి మంత్రాంగం నడిపిన మొదటి మహిళా మంత్రి .. నాగమ్మ ……….. మన పల్నాడు.
🌹మాచర్ల చెన్నకేశవుడి ఆశీస్సులతో చాపకుడు సిద్ధాంతం ద్వారా సామాజిక న్యాయం కోసం నిలబడ్డ పల్నాటి బ్రహ్మనాయుడు … మన పల్నాడు.
🌹మేటి చెన్నకేశవుడు మెచ్చి ఏలిన నేల మన పల్నాటి నేల… మన పల్నాడు.
🌹వీరుల గుడి, కారంపూడి ….. మన పల్నాడు.
🌹అక్కర లో ఉన్నవారిని చేదుకునే కోటయ్య వెలసిన పుణ్యక్షేత్రం, కోటి ప్రభులతో ప్రభవిల్లిన కోటి వేల్పుల అండ కోటప్పకొండ ……. మన పల్నాడు.
🌹గురి గల కోళ్ల పందాల నేల – గురజాల .. …… మన పల్నాడు.
🌹ప్రపంచంలోనే ఏకైక చేత వెన్న ముద్ద చిన్ని కృష్ణుని కొవెల ఉన్న సొలస గ్రామం, చంగిస్ ఖాన్ పేట … మన పల్నాడు.
🌹శ్రీ కృష్ణ దేవ రాయుల కే కొరుకుడు పడిన కొండవీటి రెడ్డి రాజులు… మన పల్నాడు.
🌹అరుదైన, ప్రపంచంలోనే అతి పెద్దైన వజ్రాలలో ఒకటైన కోహినూర్ వజ్రాన్ని ప్రపంచానికి అందించిన బెల్లంకొండ మండలం కోళ్ళూరు ………… మన పల్నాడు.
🌹నీరు పెట్టావా, నారు పోసావా, కోత కోసావా, కుప్ప నూర్చావా? ఎందుకు కట్టాలి రా శిస్తూ ..? అంటూ బ్రిటిష్ వారిపై కన్నెర్ర చేసి ప్రాణ త్యాగం చేసిన పుల్లరి ఉద్యమ కొదమసింహం కన్నెగంటి హనుమంతు…. మన పల్నాడు.
🌹సామాజిక అనాచారం వల్ల శివ దర్శనానికి నోచుకోలేని వేదనను గబ్బిలం ద్వారా వినిపించిన మహాకవి… కవితాధారలల్లిన గుర్రం జాషువా అడుగుజాడ…….. మన పల్నాడు.
🌹వినుకొండ వల్లభరాయిని క్రీడా ప్రాంగణము వినుకొండ పట్టణము… మన పల్నాడు.
🌹శిల్పకళ ప్రాంగణం- దుర్గి…. మన పల్నాడు.
🌹మహామునుల క్షేత్రం దైదా……… మన పల్నాడు.
🌹పల్నాటి ప్రజల ప్రాణేరు మన నాగులేరు.. మన పల్నాడు.
🌹సుగంధ ద్రవ్యాల పాదు – యడ్లపాడు…. మన పల్నాడు.
🌹చింతలు తీర్చే అమృతవాహిని – పులిచింతల… మన పల్నాడు.
🌹కాలచక్ర ఉత్సవాల కాంతి వలయం ………. మన పల్నాడు.
🌹శ్రీ పర్వతపు శోభలతో వెలుగొoదిన నేల… మన పల్నాడు.
🌹ప్రసన్న రామలింగడు, భావనారాయణడు అమృత దిక్కులతో ఏలిన అనన్యసీమ.. మన పల్నాడు.
🌹భీమలింగేశ్వరుని ప్రభావరూపును పొదివికొన్న పేట మన రాజు గారి కోట… మన పల్నాడు.
🌹రావణుడు సీతను అపహరించిన వార్తను శ్రీరాముడు జటాయువుచే విన్నప్రాంతం – వినుకొండ .. మన పల్నాడు.
🌹ఇనుప యుగం కాలం నాటి ఆది మానవుల బంతి రాళ్లు, సమాధులు, అవశేషాలు లభీంచిన – తేరాల, పోలేపల్లి, పసువేముల … మన పల్నాడు.
🌹అందరూ ఆరాధించే ఆరాధ్యదైవం అడిగొప్పల నిదానంపాటి అమ్మవారు … మన పల్నాడు.
🌹ప్రాచీన కాలం నాటి బౌద్ధమత స్తూపాల ఆనవాళ్లు లభించిన ప్రాంతం – గోలి… మన పల్నాడు.
🌹తొలి తెలుగు శాసనాలు లభించిన ప్రాంతం నరసరావుపేట.. మన పల్నాడు.
🌹ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ స్పిన్నింగ్ మిల్లులు(34) కలిగి ఉన్న ప్రాంతం… మన పల్నాడు.
🌹మిసిమి చెందిన మిరప ఘాటు ………….. మన పల్నాడు.
🌹హాస్య బ్రహ్మ బ్రహ్మానందం జన్మస్థలం – ఇరుకుపాలెం …… మన పల్నాడు.
🌹తెలుగు తమిళ కన్నడ భాషలలో ప్రసిద్ధిగాంచిన గాయకుడు మనోది … మన పల్నాడు.
🌹ఆంధ్రప్రదేశ్ నాటక రంగాన్ని ఉర్రూతలుగించిన మహా గొప్ప నాటక రంగనాయకులు….మీసాల కృష్ణుడు బెల్లంకొండ సుబ్బారావు గారిది …….. మన పల్నాడు.
🌹చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి పాత్రతో ప్రఖ్యాతిగాంచిన అరవపల్లి సుబ్బారావు గారిది …… మన పల్నాడు.
🌹దేశ స్థాయిలోనే ప్రఖ్యాతి గాంచిన మడత మంచాలకు ప్రసిద్ధి ……… మన పల్నాడు.
🌹శ్రీ భారతీ తీర్థ స్వాములవారి బాల్య ప్రాంగణం …… మన పల్నాడు.
🌹తోలు బొమ్మల తయారీ కేంద్రం …… మన పల్నాడు.
🌹అతి పెద్ద బహుళార్ధ సాధక ప్రాజెక్ట్ – నాగార్జున సాగర్ ప్రాజెక్టు …… మన పల్నాడు.
🌹దేశంలోనే అతిపెద్ద పులుల అభయారణ్యం – నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ …… మన పల్నాడు.
🌹చంద్రవంక అందాల జలపాతం – ఎత్తిపోతల …… మన పల్నాడు.
🌹మినీ ముంబైగా పిలుచుకునే లైమ్ సిటీ – పిడుగురాళ్ల …… మన పల్నాడు.
🌹మానవ దేవాలయంగా మాన్య ప్రధానమంత్రి చేత కీర్తించబడిన తెలుగు వారి వరం నాగార్జున సాగరం………… మన పల్నాడు.
🌹యతితపోతలమే ఎత్తిపోతల గా ఎందరికో ఆనందానుభూతిని పంచుతున్న అందాల భూతలం.. మన పల్నాడు.
🌹వేలాది మంది కార్మికులకు ఉపాధిని కల్పిస్తున్న కల్పతరువు… స్పిన్నింగ్ మిల్లులు………. మన పల్నాడు.
🌹ఎక్కువ సిమెంట్ ఫ్యాక్టరీలు కలిగి ఉన్నా ప్రాంతం…………… మన పల్నాడు.
ప్రపంచపటంలో మన పల్నాటిని ప్రత్యేక స్థానంలో నిలిపిన నిలుపుతున్న పల్నాటి నాయకులకు, ప్రజాప్రతినిధులకు, కళాకారులకు, ప్రజలకు ప్రపంచ పర్యాటక దినోత్సవ శుభాకాంక్షలు.
కృత్తికాశుక్లా ఐఏఎస్
కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.