నారద వర్తమాన సమాచారం
కష్ట జీవులు, సేవాపరులు ఆటో డ్రైవర్లు : జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా
టౌన్ హాల్ లో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం ప్రారంభోత్సవం
జిల్లాలోని 8884 మంది డ్రైవర్లకు మొత్తం రూ.13.32 కోట్లు జమ
నరసరావు పేట,
ఆటో డ్రైవర్లు పొద్దున నుంచీ సాయంత్రం వరకూ రోడ్ల మీదే జీవనం సాగించే కష్టజీవులని, గర్భిణీలను, కష్టంలో ఉన్న అభాగ్యులను అవసరమైతే ఉచితంగా గమ్యానికి చేర్చే సేవాపరులని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా కొనియాడారు. కరోనా సమయంలో ఆటో డ్రైవర్లు చేసిన సేవ వెలకట్టలేనిదన్నారు.
శనివారం మధ్యాహ్నం స్థానిక టౌన్ హాలులో ఆటో డ్రైవర్ల సేవలో పథకం కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా, ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు ప్రారంభించారు. జిల్లాలో మొత్తం 8,884 మంది ఆటో డ్రైవర్ల బ్యాంకు ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.15,000 చొప్పున మొత్తం రూ.13,32,60,000, నరసరావు పేట నియోజకవర్గానికి సంబంధించి 1577 డ్రైవర్లకు రూ.2,36,55,000 మెగా చెక్కులను పంపిణీ చేశారు. ఇందులో 6868 ఆటో రిక్షా డ్రైవర్లకు మందికి రూ. 10,30, 20,000, 1123 త్రీ వీలర్ ప్యాసింజర్ డ్రైవర్లకు రూ.1,83,45,000, 550 మోటార్ క్యాబ్ డ్రైవర్లకు రూ.82,50.000, 235 మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు రూ.32.25.000, నలుగురు లగ్జరీ టూరిస్టు క్యాబ్ డ్రైవర్లకు ₹60,000, లగ్జరీ క్యాబ్ డ్రైవర్లకు 2, ₹ 30,000. సెమీ లగ్జరీ క్యాబ్ డ్రైవర్లకు ఒకరికి ₹15,000, ఇతరులకు ఒకరికి ₹ 15,000, మొత్తం కలిపి రూ.13,32,60,000 అందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అలాంటి కష్ట జీవుల కోసం ప్రభుత్వం భోజన ఖర్చులు తగ్గించేందుకు అన్నా క్యాంటీన్ పథకంతో రూ.5 లకే భోజనం అందిస్తోందన్నారు. ప్రభుత్వం అందించిన రూ.15,000 వాహనాల రిపేర్లకు, బీమా సేవలకు ఉపయోగపడుతుందన్నారు. డ్రైవర్లు అందరూ తమ పిల్లలను బాగా చదివించుకుని ఉన్నత స్థాయికి తీసుకురావాలని సూచించారు.
ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు వ్యక్తిగత ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలన్నారు. డ్రైవర్ల ఆరోగ్యం మీద వారి కుటుంబం ఆధారపడి ఉందని గుర్తుంచుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవలో పథకంలో కేవలం నరసరావు పేటలో 1500 మందికి పైగా డ్రైవర్లకు రూ.2.36 కోట్లు నగదు జమ చేయడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంధాలయ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, ఆర్టీవో సంజీవ్ కుమార్, ఆర్డీవో మధులత, బ్రేక్ ఇన్స్ పెక్టర్ శివ నాగేశ్వరరావు,తహశీల్దార్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.