నారద వర్తమాన సమాచారం
పోరాటానికి ముగింపు..
ఆయుధాలు వీడేందుకు సిద్ధం..
మావోయిస్టుల సంచలన ప్రకటన!
ఆయుధ విరమణపై మావోయిస్టులు సంచలన ప్రకటన చేశారు. తాము ఆయుధాలు వీడేందుకు సిద్ధంగా ఉన్నామని మావోయిస్టులు లేఖ విడుదల చేశారు.
ఈ మేరకు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. ఆపరేషన్ కగార్ లో భాగంగా మూడు రాష్ట్రాల్లో కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేస్తే ఆయుధ విరమణ తేదీని ప్రకటిస్తామని లేఖలో పేర్కొన్నారు. దీంతో, సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.
వివరాల ప్రకారం.. ఆయుధాలు వీడే విషయమై మావోయిస్టులు తాజాగా లేఖ విడుదల చేశారు. ఈ మేరకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలను పంపించారు. మావోయిస్టు ప్రతినిధి పేరుతో సీఎంలకు లేఖ అందింది. ఈ లేఖలో మావోయిస్టులు తాము ఆయుధాలు వీడి, సాధారణ జనజీవన స్రవంతిలో కలిసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ముఖ్యంగా, కేంద్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ సోను దాదా తీసుకున్న ‘పోరాటం నిలిపివేయాలన్న’ నిర్ణయానికి తాము పూర్తి మద్దతు ఇస్తున్నామని ఈ లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ మావోయిస్టు ప్రతినిధులు ఆయుధాలు విడిచిపెట్టి, ప్రభుత్వ పునరావాస పథకాలను పొందాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







