నారద వర్తమాన సమాచారం
దుప్పట్లు పంపిణీ చేస్తున్న దృశ్యం
వవర్ ఫౌండేషన్” సేవలు అభినందనీయం : గురజాల అప్పారావు
మాచర్ల : పట్టణంలో పవర్ ఫౌండేషన్ నిర్వాహకులు న్యాయవాది జీజే రావు సేవలు అభినందనీయమని ఏపీ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్ట్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు గురజాల అప్పారావు అన్నారు. సొసైటీ కాలనీలోని పవర్ ఫౌండేషన్ కార్యాలయం ప్రాంగణంలో ఆదివారం దుప్పట్లు, 200 మంది కి అన్నదానం నిర్వహణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అప్పారావు మాట్లాడుతూ పవర్ ఫౌండేషన్ ద్వారా వికలాంగులను ఆదుకోవడం గర్వించదగ్గ విషయమన్నారు. ఫౌండేషన్ నిర్వాహకులు జి జె రావు ఇప్పటికే తన ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలను నిర్వహించటం జరిగిందన్నారు. ఫౌండేషన్ సేవలు మరింత విస్తరించేందుకు దాతలు సహకరించాలని ఆయన కోరారు. అనంతరం పలువురు పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఫౌండేషన్ నిర్వాహకులు జీజే రావు మాట్లాడుతూ ఎన్నో కార్యక్రమాలను తన సొంత నిధులతో నిర్వహిస్తుండటం జరుగుతుందని, దాతల సహకారం లభిస్తే పట్టణంతో పాటు పలు గ్రామాలలో తన సేవలను విస్తరించేందుకు కృషి చేస్తానన్నారు. ఫౌండేషన్ కు సహకరించేందుకు సెల్ నెం. 9492464919 ను అందుబాటులో ఉంచినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు పి మునెయ్య, దండు నాగేశ్వరరావు, కార్యదర్శి ఎన్. కోటయ్య మాస్టర్, ప్రోగ్రాం కన్వినర్ సాంబశివరావు, హ్యూమన్ రైట్స్ సభ్యులు సైకం కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







